P Krishna
Kannamba Life Story: ఒకప్పటి నటీమణులు తమ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసేవారు. అలాంటి పాత తరం నటీమణుల్లో ఒకరు కన్నాంబ. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు.
Kannamba Life Story: ఒకప్పటి నటీమణులు తమ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసేవారు. అలాంటి పాత తరం నటీమణుల్లో ఒకరు కన్నాంబ. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు.
P Krishna
పాత తరం హీరోయిన్లు అంటే వెంటనే గుర్తుకు వచ్చేవారిలో భానుమతి, ఎస్ వరలక్ష్మి, కన్నాంబ. వీరి తర్వాత సావిత్రి, జమున, కాంచన ఇలా పలువురు నటీమణులు గుర్తుకు వస్తారు. అయితే నాటి హీరోయిన్లు గ్లామర్ విషయం గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. నటనకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. చాలా మంది నటీమణులు నటనతో పాటు నాట్యం, సంగీతం లో మంచి ప్రావిణ్యం ఉండేది. అలాంటి హీరోయిన్లలో కన్నాంబ ఒకరు. పాత తరం హీరోయిన్లలో కన్నాంబ స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగారు. ఆమె మరణం తర్వాత ఓ సంఘటన జరిగింది. అది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో పాత తరం స్టార్ హీరోయిన్లలో ఒకరు కన్నాంబ. ఆమె అసలు పేరు పసుపులేటి కన్నాంబ.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912 లో జన్మించిన కన్నాంబ 13వ ఏటనే బాలనటిగా రంగస్థలం మీద తన సత్తా చాటింది. ఆ అనుభవంతోనే 1935 లో ‘హరిశ్చంద్ర’ సినిమాలో చంద్రమతి, ‘ద్రౌపతి వస్త్రాపహరణం’ మూవీలో ద్రౌపతిగా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత పాదుక, చింద్రిక, పట్నాటి యుద్దం, కనకతార, గృహలక్ష్మి, అనార్కలి, దక్ష యజ్ఞం, తోడికొడళ్ళు ఇలా ఎన్నో సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించింది మంచి పేరు సంపాదించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, నాగయ్య, ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో దాదాపు 150 చిత్రాలకు పైగా పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించారు కన్నాంబ.
నటిగా మంచి ఫామ్ లో ఉండగానే కడారు నాగభూషనం ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ స్థాపించి ఎంతోమంది నటీనటులకు మంచి అవకాశం కల్పించారు. తెలుగు, తమిళ భాషల్లో 22 సినిమాలు నిర్మించారు. తమ కంపెనీలో ఉద్యోగస్థులకు ఎప్పటికప్పుడు జీతాలు చెల్లిస్తూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు.ఒకటో తేది రాక ముందే జీతాలు చెల్లించేవారు అని పేరు ఉండేది. కన్నాంబ నటిగానే కాకుండా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో కనిపించేవారు. అయితే ఆమె కట్టు, బొట్టు హీరోయిన్ లాగే ఉండేవి. ఒకప్పుడు కన్నాంబ పేరు తో చీరలు, గాజులు, ఫ్యాన్సీ వస్తువులు అమ్మేవారు అంటే ఆమె ఎంత ఫేమస్ అనేది తెలిసిపోతుంది. ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్న కన్నాంబ గొప్ప ఆస్తిపరురాలని అనేవారు. అప్పట్లో ఆమె బంగారు కాసులు డబ్బాల్లో పోసి ఎవరికీ తెలియకుండా దాచేవారని చెప్పుకునే వారు.
జీవితం అన్న తర్వాత ఎత్తు పల్లాలు ఉంటాయి.. అంత గొప్ప ఆస్తి పరురాలైన కన్నాంబ చనిపోయిన తర్వాత ఆస్తులన్నీ కరిగిపోయాయి. అవి ఎలా పోయాయో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఆమె భర్త చివరి రోజుల్లో ఒక చిన్న గదిలో ఒక కుర్చీ, పడుకోవడానికి నేలపై ఒక చాప మాత్రమే ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తైతే.. కన్నంబా చనిపోయిన తర్వాత జరిగి ఓ సంఘటన గురించి ఇప్పటికీ చర్చించుకుంటారు. వారి కులాచారం ప్రకారం భార్య చనిపోతే మృతదేహానికి నగలు ధరింపజేసి యథాతథంగా పూడ్చి పెట్టాలి.అదే ప్రకారం కన్నాంబను కూడా పూడ్చి పెట్టారు. రెండు రోజుల తర్వాత పూడ్చి పెట్టిన చోట మృతదేహాన్ని దొంగలు బయటకు తీసి ఆమె నగలు ఎత్తుకెళ్లారు. అంతేకాదు ఆమె మృత దేహం కూడా మాయం అయ్యింది. దీనిపై అప్పట్లో పోలీస్ కేసు నమోదు కాగా.. వారు విచారణ చేపట్టారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ఆ మృతదేహం ఏమైందో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.