Actress Gautami: రూ.3 కోట్ల భూమి కబ్జా.. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతా : నటి గౌతమి

రూ.3 కోట్ల భూమి కబ్జా.. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతా : నటి గౌతమి

Actress Gautami: ఇటీవల డబ్బు కోసం కేటుగాళ్లు ఎలాంటి మోసాలకైనా తెగబడుతున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం మోసగాళ్ళ చేతుల్లో బలవుతున్నారు. ప్రముఖ నటి గౌతమికి కూడా ఇలాంటి కష్టమే వచ్చింది.

Actress Gautami: ఇటీవల డబ్బు కోసం కేటుగాళ్లు ఎలాంటి మోసాలకైనా తెగబడుతున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం మోసగాళ్ళ చేతుల్లో బలవుతున్నారు. ప్రముఖ నటి గౌతమికి కూడా ఇలాంటి కష్టమే వచ్చింది.

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో తన గ్లామర్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ప్రముఖ నటి గౌతమి గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించింది. ఆ మధ్య కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన గౌతమి సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించింది. పలు టీవీ షోల్లో జడ్జీగా వ్యవహరిస్తుంది. ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు భూ కబ్జాలకు పాల్పపడుతూ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి మోసాలకు తెగబడుతున్నారు. నటి గౌతమికి సంబంధించిన భూమిని కబ్జా చేయడంతో వారిపై న్యాయ పోరాటానికి దిగింది. నటి గౌతమి విషయంలో ఏం జరిగిందీ? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ భూ వ్యవహారంలో కొంతమంది తనను మోసం చేశారని..తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని నటి గౌతమి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమిళనాడులోని కారైక్కుడికి చెందిన అళగప్పన్.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి ఉన్న స్థలాన్ని కబ్జా చేసి, ఆపై నకిలీ పత్రాలను సృష్టించి వేరే వ్యక్తులకు అమ్మాడు. ఈ ప్రాపర్టీ విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని తన ప్రమేయం లేకుండా తన భూమిని విక్రయించాడని, ఇదేంటని ప్రశ్నిస్తే తనతో దురుసుగా ప్రవర్తించడమే కాదు.. బెదిరింపులకు పాల్పపడతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది.   మూడు కోట్లు విలువ చేసే తన భూమిని కబ్జా చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పింది గౌతమి. ఈ కేసులో తనకు న్యాయం దక్కే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని చెబుతుంది.

నటిగా మంచి ఫామ్ లో ఉన్నపుడు గౌతమి రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిది. ఈ క్రమంలోనే అళగప్పన్ అనే వ్యక్తి గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని ముందుగా ఆ పత్రాలు పరిశీలించాడు. ఆ సమయంలోనే వాటికి నకిలీ పత్రాలు సృష్టించి గౌతమికి తెలియకుండా మరో వ్యక్తికి అమ్మాడు. అసలు నిజం వెలుగులోకి రావడంతో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే నీ దిక్కున్నచోట చెప్పుకో అని బెదిరిస్తున్నాడని గౌతమి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువులపై కేసు పెట్టారు. ఏడాదిగా వారంతా బెయిల్ పై ఉన్నారు. తాజాగా నిందితులు మరోమారు దాఖాలు చేసిన బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చింది. గౌతమి తరుపున హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ వారికి బెయిల్ ఇవ్వవొద్దని కోరారు.

Show comments