షార్ట్ కట్స్‌లో స్టార్ అవ్వాలంటే అలా చేయక తప్పదు: నటి ఎస్తర్!

Ester Noronha Sensational Comments: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ క్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంతో మంది నటీమణులు గతంలో తాము కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అని బహిరంగంగా మాట్లాడుతున్నారు.

Ester Noronha Sensational Comments: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ క్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంతో మంది నటీమణులు గతంలో తాము కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అని బహిరంగంగా మాట్లాడుతున్నారు.

దేశంలో ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. ఏ వ్యవస్థలో అయినా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇది కాస్త ఎక్కువే అంటారు. క్యాస్టింగ్ కౌచ్ అంటే.. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అవకాశాల కోసం వచ్చే యువతులను తమ పడక గదికి వస్తే ఛాన్సు ఇస్తామని ప్రలోభ పెట్టడం. అలా  సినీ పెద్దలకు కమిట్‌మెంట్ ఇచ్చినప్పటికీ సినిమాల్లో ఛాన్సులు రాక ఎంతోమంది యువతులు మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇండస్ట్రీలో నటిగా ఛాన్సు దక్కించుకోవాలన్నా.. షార్ట్ కట్‌లో స్టార్ రేంజ్ సంపాదించాలన్నా మనసు చంపుకొని కొన్ని పనులు చేయాల్సిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి ఎస్సర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో నటి ఎస్సర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన కాంట్రవర్సీ కామెంట్స్ తో హడావుడి చేస్తుంది. ప్రస్తుతం పలు రియాల్టీ షోలు, వెబ్ స్టోరీస్, సినిమాల్లో నటిస్తుంది. నటిగా తనకంటూ ప్రత్యక ఇమేజ్ సొంతం చేసుకుంది.  సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై తనదైన స్టైల్లో కామెంట్స్ చేసింది ఎస్తర్ నోరాన్హా. గతంలో తనకు కూడా ఎన్నోసార్లు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత సులువైన విషయం కాదని.. గతంలో ఎస్సర్ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎస్సర్ నోరాన్హా మాట్లాడుతూ.. ‘ సమాజంలో సినీ ఇండస్ట్రీల ఒక భాగమే.. బయట సమాజంలోనే కాదు ఇక్కడ వేధింపులు ఎక్కువే ఉంటాయి. ఎంటర్‌టైన్ మెంట్ రంగంలో నిత్యం ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు మహిళలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వస్తారు. అలాంటి వారి వీక్ నెస్ చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇండస్ట్రీలో షార్ట్ కట్ లో ఎదగాంటే.. మాకేమిస్తావు అనేవారు చాలా మంది ఉన్నారు. నాకు కూడా పలు సందర్భాల్లో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కానీ నేను ఏదీ లెక్కచేయలేదు, నా దారిలోనే వెళ్లాను. నా వరకు నేను నా టాలెంట్ నమ్ముకున్నాను, హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. టాలెంట్ తోనే మనకు సక్సెస్ రావాలని కోరుకోవాలి’ అని తెలిపింది.

Show comments