ప్రమాదంలో స్టార్ యాక్టర్ కెరీర్.. పంథా మార్చకపోతే అంతే!

ప్రస్తుతం ఓ స్టార్ యాక్టర్ విలన్ గా సూపర్ ఎక్స్ పోజర్ అవుతున్నాడు. డైరెక్టర్లు విలన్ రోల్స్ కు అతడినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అయితే అతడు ఇలా వచ్చిన ప్రతీ విలన్ పాత్రను ఒప్పుకుంటే.. మరో ప్రకాశ్ రాజ్ అవుతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ యాక్టర్ ఎవరంటే?

ప్రస్తుతం ఓ స్టార్ యాక్టర్ విలన్ గా సూపర్ ఎక్స్ పోజర్ అవుతున్నాడు. డైరెక్టర్లు విలన్ రోల్స్ కు అతడినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అయితే అతడు ఇలా వచ్చిన ప్రతీ విలన్ పాత్రను ఒప్పుకుంటే.. మరో ప్రకాశ్ రాజ్ అవుతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ యాక్టర్ ఎవరంటే?

ఇండస్ట్రీలో ఎంతో మంది విలక్షణమైన నటులు ఉన్నారు. అయితే అందులో కొంత మాత్రమే బయటకి వచ్చారు. మిగతావారు ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నారు. విలక్షణ నటుడు అనగానే మనందరికి ఠక్కున్న గుర్తుకు వచ్చే యాక్టర్ ప్రకాశ్ రాజ్. ఇతడు సూపర్ ఎక్స్ పోజ్ అవ్వడంతో.. విలన్ రోల్ అనగానే ప్రకాశ్ రాజ్ నే తీసుకుందాం అని మేకర్స్ ఫిక్స్ అయ్యేవారు. అలా టాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఏలాడు. కానీ రొటీన్ విలనిజంతో ప్రేక్షకులకు దూరమైయ్యాడు. ఇక ఇప్పుడు సేమ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఓ స్టార్ యాక్టర్. భవిష్యత్ లో తన పంథా మార్చుకోకపోతే.. కెరీర్ డేంజర్ లో పడ్డట్లే అంటున్నారు సినీ పండితులు. మరి ఆ  క్రేజీ స్టార్ ఎవరు?

చిత్ర పరిశ్రమలో మల్టీటాలెంటెడ్ వ్యక్తులకు కొదవలేదు. నటుడు, డైరెక్టర్, నిర్మాతగా, హీరోగా, విలన్ గా రాణిస్తున్న వారిలో ఎస్ జే సూర్య ఒకడు. మహేశ్ బాబు స్పైడర్ మూవీలో విలన్ గా సూర్య ఏ రేంజ్ విలనిజం పండించాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాంతో ఒక్కసారిగా ఎక్స్ పోజర్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి సూర్యకు వరుసగా విలన్ రోల్సే వస్తున్నాయట. బాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా సూర్య పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం సరిపోదా శనివారం, రాయన్, గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 మూవీస్ తో పాటుగా మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎస్ జే సూర్య పై ఓవర్ ఎక్స్ పోజర్ ఉంది. దాంతో గంపగుత్తగా విలన్ రోల్స్ మెుత్తం అతడికే వెళ్తున్నాయి. గతంలో ఇలా ప్రకాశ్ రాజ్ విలన్ రోల్స్ కు ఎక్స్ పోజ్ అయ్యాడు. ఇప్పుడు సూర్య అవుతున్నాడు. అయితే.. ప్రకాశ్ రాజ్ చాలా సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేయడంతో.. రొటీన్ విలనిజంతో బోర్ కొట్టాడు. దాంతో అతడు ప్రేక్షకుల నుంచి డిస్ కనెక్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు సూర్యది కూడా అదే పరిస్థితిలా కనిపిస్తోంది. ఛాన్స్ లు వస్తున్నాయి కదా అని వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పుకుని రొటీన్ విలనిజం చూపిస్తే మాత్రం ఎస్ జే సూర్య మరో ప్రకాశ్ రాజ్ అవ్వడం ఖాయం అని సినీ పండితులు చెబుతున్నారు. పంథా మార్చకపోతే అతడి కెరీర్ ప్రమాదంలో పడుతుందని అభిమానులు సైతం కంగారు పడుతున్నారు. మరి ఎస్ జే సూర్య విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments