ఇండస్ట్రీలో స్టార్ నోటి నుండి ఏ మాట బయటికి వచ్చినా.. ఖచ్చితంగా వాటిపై సోషల్ మీడియా డిబేట్స్ జరుగుతుంటాయి. ఆ మాటలు తప్పు అనిపిస్తే.. ఎంతటి స్టార్ నైనా తిరిగి ప్రశ్నిస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ తమిళ ఇండస్ట్రీకి కొన్ని సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ.. “అన్ని భాషలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ ని తెలుగు ఇండస్ట్రీ ఆహ్వానిస్తుంది. కాబట్టి.. బాహుబలి, RRR లాంటి బిగ్గెస్ట్ సినిమాలు తీసే స్థాయికి టాలీవుడ్ ఎదిగింది. అయితే.. కోలీవుడ్ లో మాత్రం.. ఇండస్ట్రీలో తమిళ వారే ఉండాలని నిబంధనలు పెట్టుకున్నట్లు నేను విన్నాను. అది కరెక్ట్ కాదు. అన్ని భాషల వాళ్ళని ఆహ్వానిస్తేనే ఇండస్ట్రీ పైకి వస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంపై సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా చర్చలు జరిగాయి. అటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. తమిళ సినిమాలలో తమిళ జనాలే వర్క్ చేయాలని అక్కడి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పెట్టిన కొత్త నిబంధనను ఉద్దేశించి పవన్ మాట్లాడినట్లు అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తమిళ ఇండస్ట్రీ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలను నడిగర్ సంఘం అధ్యక్షులు, నటుడు నాజర్ తీవ్రంగా ఖండించారు. లేని నిబంధనలు ప్రచారం చేయొద్దంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. నాజర్ మాట్లాడుతూ.. “కోలీవుడ్ లో వేరే భాషల వారు పని చేయకూడదు అనే రూల్ లేదు. అదంతా ప్రచారం జరుగుతుంది.
అటువంటి రూల్స్ వస్తే.. ముందు నేనే ఖండిస్తాను.. వ్యతిరేకిస్తాను. సినీ పరిశ్రమలో కళాకారులకు సరిహద్దులు ఉండవు. ఎవరో కావాలని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ పై మాట్లాడారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించారు. ఇటీవల సినీ కార్మికుల కోసం సెల్వమణి.. తమిళ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్స్ ని పెట్టుకోండని సూచించారు. అంతేగాని ఇతర భాషల వాళ్ళని వద్దని ఎవ్వరూ చెప్పలేదు. సినిమాల్లో ఇప్పుడు భాషాబేధం లేదు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. ఓటీటీ వచ్చాక అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. బాహుబలి, RRRల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం” అని నాజర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాజర్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పవన్ కళ్యాణ్, నాజర్ ల వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Nadigar Sangam (SIAA) President, actor #Nasser, from Hyderabad, clarifies on some misrepresented news doing rounds in media.@johnsoncinepro pic.twitter.com/Q61BuUYgB6
— Ramesh Bala (@rameshlaus) July 27, 2023