Keerthi
Darshan: అభిమాని రేణుకాస్వామి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నా దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. అప్పటి వరకు జైల్లో ఉండాలంటూ కోర్టు ఆదేశించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
Darshan: అభిమాని రేణుకాస్వామి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నా దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. అప్పటి వరకు జైల్లో ఉండాలంటూ కోర్టు ఆదేశించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
Keerthi
అభిమాని చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కన్నడ ఛాలెంజింగ్ స్టార్ హరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. ముఖ్యంగా రేణుకాస్వామి హత్యకు దర్శన్, పవిత్రనే ప్రధాన నిందితులని బలమైన సాక్ష్యలు, నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో దర్శన్ నే ఈ హత్య చేయించడంటూ పోలీసులు ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కనీసం దర్శన్ కు బెయిల్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోయింది. కానీ, ఇటీవలే ఈ విషయంలో కాస్త ఊరట లభించిన దర్శన్, పవిత్రకు మరోసారి ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రస్తుతం ఈ హత్య కేసులో నిందుతుడిగా దర్శన్ బళ్లారీ జైల్లో ఉండగా, అతని ప్రియురాలుతో సహా మరో 15 నిందుతులు పరప్పన జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగిసిందని, ఈ నేపథ్యంలోనే.. దర్శన్ తో సహా మిగిలిన నిందితులందరికి జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి, ఛార్జ్ షీట్ అందజేయనున్నారని సమాచారం వినిపించింది. దీని ద్వారా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని టాక్ వినిపించిన విషయం తెలిసిందే. కానీ, ఇంతలోనే ఈ జ్యుడీషియల్ కస్టడీ విషయంలో దర్శన్ అతని ప్రియురాలు పవిత్రకు ఊహించని నిరాశే మిగిలింది.
ఎందుకంటే.. ఈ కేసుకు సంబంధించిన జ్యూడీషియల్ కస్టడీని కోర్టు మరి కొన్ని రోజులు పొడిగించింది. దీంతో ఇప్పటిలో ఈ కేసు నుంచి దర్శన్, పవిత్ర గౌడ, గ్యాంగ్ కు బెయిల్ దక్కే భాగ్యం కనిపించడం లేదని తెలుస్తోంది. పైగా రోజు రోజుకి కోర్టు వారి కస్టడీని పొడిగిస్తూ వస్తుంది. ఇకపోతే ఈ హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించి బెంగళూరు పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్ రెడీ చేశారు. ఈ నేపథ్యంలోనే జ్యుడీషియల్ రిమాండు నిన్న శుక్రవారంతో ముగియడంతో పోలీసులు 17మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24వ ఏసీఎంఎం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. అందులో పూర్తి చార్జిషీట్ సమర్పించాలని, ఎల్రక్ట్రానిక్స్ సాక్ష్యాలను ఒక వారంలోపు ప్రవేశ పెట్టాలని పోలీసులను ఆదేశించింది.
అలాగే నిందితులకు సెప్టెంబర్ 17 వరకూ కస్టడీని పొడిగించింది. కానీ, ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ ముందుగా కోర్టులో పెట్టుకున్న బెయిలు పిటిషన్ వెనక్కు తీసుకుంది. అయితే చార్జిషీట్ దాఖలైందని, పలు సాంకేతిక కారణాలు చూపుతూ ఆమె న్యాయవాదులు వాపస్ తీసుకున్నారు. కానీ, త్వరలో కొత్త బెయిలు అర్జీ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది. మరీ, ఈ కేసులో కోర్టు జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.