దీన స్థితిలో ఒకప్పటి స్టార్ కమెడియన్

సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరినీ ఆదరిస్తుందో, ఎవరినీ తెరమరుగు చేస్తుందో చెప్పలేం. ఒకప్పుడు స్టార్ హోదాకు ఎదిగిన నటీనటులు కూడా కొన్ని రోజులకు కనిపించకుండా పోతుంటారు. టాలీవుడ్ అనే కాదూ ఏ పరిశ్రమలో అయినా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడో వారి సినిమాలు చూసినప్పుడు.. అరే ఈ నటుడు ఉండేవాడు కదా అంటూ స్మరించుకుంటారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ అన్ని అవకాశాలు, అలాంటి పాత్రలు వస్తాయని చెప్పలేం. కొంత మందికి అటువంటి అవకాశాలు కూడా రావు. అయితే ఎప్పుటికైనా అవకాశాలు రాకపోతాయా అంటూ ఎదురు చూస్తుంటారు. తాను అలానే చూస్తున్నట్లు చెప్పారు బాలీవుడ్ నటుడు టికూ తల్సానియా. ఇప్పటి యువతరానికి ఈయన పెద్దగా పరిచయం ఉండడు కానీ 1980-90 దశకంలో తన మాటలతో, హాస్యంతో కితకితలు పెట్టించారు.

ప్యార్ కే దో పాల్ చిత్రంలో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన టికూ.. బోల్ రాధా బోల్, అందాజ్ అప్నా, అప్నా, ఇష్క్, జోడి నెంబర్ , రాజా హిందూ స్థానీ, హీరో నంబర్ 1, చోటీ బహు, హంగామా , హంగామా 2 వంటి చిత్రాల్లో నటించాడు. చివరగా గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన సర్కస్‌లో కనిపించారు. ఇప్పుడు కనిపించకపోవడానికి కారణం అవకాశాలు లేకపోవడమేనని అంటున్నారు టికూ. దాదాపు 40 సంవత్సరాలుగా ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన.. ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ‘సినీ పరిశ్రమలో ఒకప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేర్వేరు. అప్పట్లో సినిమాలన్నీ ఒకే రకమైన ఫార్ములాలో ఉండేవి. నటీనటుల మధ్య సాంగ్స్, హీరోపై ఫైట్స్, కామెడీ ట్రాక్ ఉండేది. ప్రస్తుతం స్టోరీ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్నాయి. కథలో కామెడీ పాత్రలు ఉంటేనే అవకాశాలు. ప్రస్తుతానికి నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. అవకాశాలు కూడా రావడం లేదు. ఆడిషన్స్ కు పిలిస్తే తప్పకుండా వెళతా’ అని అన్నారు. తనకు నటనంటే ఎంతో ఇష్టమని, ప్రస్తుతం చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవని చెబుతున్నారు.

Show comments