Swetha
ఇప్పటివరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రానికి.. ఏ రకంగా నెగెటివిటీ వచ్చిందో చూస్తూనే ఉన్నాము. అయితే, ఇలా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకున్నట్లు ఓ వార్త వినిపిస్తోంది.
ఇప్పటివరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రానికి.. ఏ రకంగా నెగెటివిటీ వచ్చిందో చూస్తూనే ఉన్నాము. అయితే, ఇలా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకున్నట్లు ఓ వార్త వినిపిస్తోంది.
Swetha
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బడా హీరోల చిత్రాలలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” ఒకటి. అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజున యావరేజ్ టాక్ సంపాదించుకున్న మాట నిజమే. కానీ రోజు రోజుకి ఆడియన్సులో ఈ సినిమా మీద ఒపీనియన్ మారుతూ వచ్చింది. మొదటి రోజున నెగిటివ్ టాక్ నడిచిన కూడా.. గుంటూరు కారం మంచి కలెక్షన్లనే తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం ఫ్యామిలి ఆడియన్సును ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలైన కొద్దీ రోజులలోనే బ్రేక్ ఈవెన్ ను దాటినా కూడా.. మొదటిగా వచ్చిన నెగెటివ్ టాక్ మాత్రం ఇంకా అలానే స్ప్రెడ్ అవుతూ ఉంది. దీనితో కావాలనే ఇలా నెగెటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారా అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.
ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా.. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందించారు. గుంటూరు కారం చిత్రం మీద నెగెటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడమే కాకుండా.. ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్లు కూడా ఫేక్ అంటూ కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. అటువంటి వారందరికీ నాగవంశీ సవాల్ చేశారు. ఎవరైతే ఫేక్ కలెక్షన్స్ అని మాట్లాడుతున్నారో.. వారు ఆ విషయాన్నీ ప్రూవ్ చేయండి అంటూ..ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అటు ఇండస్ట్రీలోను.. ఇటు సామాజిక మాధ్యమాలలోను.. గుంటూరు కారం విడుదలైన దగ్గరనుంచి.. ఈ సినిమా మీద వివాదాస్పద చర్చలు సాగుతూనే ఉన్నాయి. కానీ, ఎందుకు ఇంత నెగెటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారో మాత్రం.. ఎవరికి అర్థంకాని విషయం. చూడబోతుంటే గుంటూరు కారం చిత్రంపైన కుట్రతోనే ఇదంతా చేసి ఉంటారనిపిస్తోంది. ఇప్పటికీ కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఈ చిత్రంపైన విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. అయితే, ఈ చిత్రం గురించి నెగెటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. తాజాగా పలు సామాజిక మాధ్యమాలలోను , యూట్యూబ్ లోను గుంటూరు కారం చిత్రం గురించి.. వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు.. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో వారిపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక గుంటూరు కారం చిత్రం మొదటి వారంలోనే రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఈ చిత్రంలో మహేష్ బాబు నటనకైతే వందకు వంద మార్కులు ఇచ్చి తీరాల్సిందే. గుంటూరు కారం చిత్రంలో నటించిన నటీ నటులు వారి పాత్రలకు తగిన న్యాయం చేశారని చెప్పడంలో.. ఏ మాత్రం సందేహం లేదు. ఏదేమైనా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మాత్రం ఒక మంచి ఫ్యామిలి ఎంటర్టైనర్ గా నిలిచిపోతుంది. మరి, గుంటూరు కారం చిత్రంపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నవిషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.