70th National Film Awards-Johnny Master, Thiruchitrambalam: జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డు.. ఏ సినిమాకంటే!

Johnny Master: జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డు.. ఏ సినిమాకంటే!

70th National Film Awards-Johnny Master: కేంద్రం తాజాగా ప్రకటించిన 70వ జాతీయ సినీ అవార్డుల్లో జానీ మాస్టర్‌ని అవార్డ్‌ వరించింది. ఇంతకు ఏ సినిమాకంటే..

70th National Film Awards-Johnny Master: కేంద్రం తాజాగా ప్రకటించిన 70వ జాతీయ సినీ అవార్డుల్లో జానీ మాస్టర్‌ని అవార్డ్‌ వరించింది. ఇంతకు ఏ సినిమాకంటే..

దేశంలో సినిమా రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించేవి జాతీయ అవార్డులు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు అనగా.. ఆగస్టు 16, నాడు కేంద్ర ప్రభుత్వం.. 70వ జాతీయ అవార్డ్‌లను ప్రకటించింది. అయితే ఈసారి తెలుగు సినిమాలకు పెద్దగా అవార్డులు రాలేదు. తమిళ, కన్నడ, హిందీ చిత్రాల హవానే కొనసాగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తీకేయ 2 నిలిచింది. ఇక తమిళంలో పొన్నియన్ సెల్వన్, కన్నడలో కేజీఎఫ్ సినిమాలను ఎక్కువ అవార్డులు వరించాయి. ప్రతిసారిలానే ఈ సారి కూడా ఉత్తరాది సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈ సారి తెలుగు వారికి రెండు అవార్డులు మాత్రమే వచ్చాయి.  ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 నిలవగా.. బెస్ట్ కొరియో గ్రాఫర్ కేటగిరీలో జానీ మాస్టర్‌ను జాతీయ అవార్డ్ వరించింది. మరి జానీ మాస్టర్‌కు ఏ సినిమాకు సంబంధించి ఈ అవార్డు వచ్చింది.

అయితే జానీ మాస్టర్‌కి ఈ అవార్డు వచ్చింది తెలుగు సినిమాకు కాదు. తమిళ్‌ చిత్రానికి గాను జాతీయ అవార్డు ప్రకటించారు. పైగా ఆయన సతీష్ కృష్ణన్‌తో కలిసి ఉమ్మడిగా అవార్డు అందుకోనున్నారు. మరి ఇంతు జానీ మాస్టర్‌కు అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం ఏదంటే.. కోలీవుడ్‌ తిరుచిత్రాంబళం. ధనుష్‌ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో తిరుగా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఈసినిమాకుగాను కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్‌ను జాతీయ అవార్డ్ వరించింది. అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఈసారి తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకు జాతీయ అవార్డుల పంట పండింది. ఇక ఎప్పటిలాగానే బాలీవుడ్‌కే ఎక్కువ అవార్డులను కట్టబెట్టారు. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన సినిమాలకు పురస్కారాలు అందిస్తుంది కేంద్రం. దేశవ్యాప్తంగా మొత్తం 28 భాషలలో విడుదలైన 300కు పైగా సినిమాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. అయితే ఈసారి ఉత్తమ నటీనటుల అవార్డులను దక్షిణాది యాక్టర్సే గెలుచుకోవడం విశేషం. కాంతార సినిమాకు గాను.. ఉత్తమ నటుడుగా రిషబ్‌ శెట్టి అవార్డు అందుకోగా.. తిరుచిత్రాంబళం సినిమాకు గాను ఉత్తమ నటిగా నిత్యా మేనన్‌కు అవార్డు దక్కింది. మరో నటి మానసి పరేఖ్‌తో కలిసి ఆమె ఈ అవార్డును పంచుకోనుంది.

 

Show comments