Swetha
Pushpa2 Collection Target ; పుష్ప 2 కి దేశవ్యాపతంగా సోలో రిలీజ్ దక్కుతుంది. కాంపిటీషన్ కు వచ్చేందుకు ఎవరు రెడీగా లేరు. ఇవన్నీ పుష్ప కి బాగానే కలిసివస్తున్నాయి. ఇదిలా ఉంటె పుష్ప 2 వెయ్యి కోట్లు సాధిస్తుందా లేదా అనేదానిపై.. అంచనాలు , విశ్లేషణలు జరుగుతున్నాయి. సినిమాలో ఎలాంటి ఫాంటసీ ఎలిమెంట్స్ లేవు.. అలాగే గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ లేవు. కేవలం ఒక మాస్ కమర్షియల్ సినిమా ఇది. మరి ఇలాంటి సినిమాకు 1000 కోట్లు సాధ్యమా!
Pushpa2 Collection Target ; పుష్ప 2 కి దేశవ్యాపతంగా సోలో రిలీజ్ దక్కుతుంది. కాంపిటీషన్ కు వచ్చేందుకు ఎవరు రెడీగా లేరు. ఇవన్నీ పుష్ప కి బాగానే కలిసివస్తున్నాయి. ఇదిలా ఉంటె పుష్ప 2 వెయ్యి కోట్లు సాధిస్తుందా లేదా అనేదానిపై.. అంచనాలు , విశ్లేషణలు జరుగుతున్నాయి. సినిమాలో ఎలాంటి ఫాంటసీ ఎలిమెంట్స్ లేవు.. అలాగే గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ లేవు. కేవలం ఒక మాస్ కమర్షియల్ సినిమా ఇది. మరి ఇలాంటి సినిమాకు 1000 కోట్లు సాధ్యమా!
Swetha
సరిగ్గా మరో రెండు వారాల్లో థియేటర్స్ లో పుష్ప జాతర మొదలవుతుంది. ఇంకా లాస్ట్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని లేట్ గా న్యూస్ బయటకు వచ్చింది. దీనితో టీమ్ మొత్తాన్ని సుక్కు ముళ్లమీద పరిగెత్తిస్తున్నాడు. ఈ రెండు వారాలలో షూటింగ్ కంప్లీట్ చేయాలి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలి.. ప్రమోషనల్ ఈవెంట్స్ తో పాటు మీడియా ఇంటర్వూస్ ప్లాన్ చేయాలి. ఇన్ని పనులు ఈ రెండు వారాలలో అవుతాయా అంటే.. అయ్యేందుకు సాధ్యమైనంత వరకు మూవీ టీం పరుగులు పెడుతుంది. అటు హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అనిల్ తదాని బాహుబలి , ఆర్ఆర్ఆర్ రేంజ్ లో స్క్రీన్స్ వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా వస్తుంది అనుకున్న చావా సినిమా కూడా పక్కకు తప్పుకుంది. సో అక్కడ కూడా లైన్ క్లియర్. ఇలా చూస్తినట్లైతే పుష్ప 2 కి దేశవ్యాపతంగా సోలో రిలీజ్ దక్కుతుంది. కాంపిటీషన్ కు వచ్చేందుకు ఎవరు రెడీగా లేరు.
ఇవన్నీ పుష్ప కి బాగానే కలిసివస్తున్నాయి. ఇదిలా ఉంటె పుష్ప 2 వెయ్యి కోట్లు సాధిస్తుందా లేదా అనేదానిపై.. అంచనాలు , విశ్లేషణలు జరుగుతున్నాయి. సినిమాలో ఎలాంటి ఫాంటసీ ఎలిమెంట్స్ లేవు.. అలాగే గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ లేవు. కేవలం ఒక మాస్ కమర్షియల్ సినిమా ఇది. మరి ఇలాంటి సినిమాకు 1000 కోట్లు సాధ్యమా! అంటే ఇప్పుడున్న పుష్ప మ్యానియా చూస్తుంటే.. సాధ్యం కాదని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నార్త్ లో బన్నీ పేరు మోత మోగిపోతుంది. అక్కడ కనుక ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఎంత లేదన్న మూడు వందల కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఇక ఏపీ, తెలంగాణ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలు , ఓవర్శిస్ అంతా కలిపి కనీసం ఆరేడు వందల కోట్ల వరకు గ్రాస్ ఈజీగా రాబడుతుందని అంచనా. 1000 కోట్ల లెక్క ఇక్కడే వచ్చేసింది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటే మాత్రం ఇక పుష్ప రాజ్ ఊచకోత ఇంతకుమించి ఉంటుందని చెప్పి తీరాల్సిందే.
ఎందుకంటే అటు టాలీవుడ్ లో కానీ.. బాలీవుడ్ లో కానీ గత కొన్ని నెలలుగా ఇలాంటి ఊర మాస్ బొమ్మ పడలేదు. రీసెంట్ గా దేవర దడ పుట్టించింది. కానీ 500 కోట్ల కలెక్షన్స్ దాటాక కాస్త ఊపు తగ్గింది. కానీ ఇప్పుడు పుష్ప సినిమా కేసు వేరే. ఇది సిక్వెల్ కాబట్టి కచ్చితంగా సినిమా చూసేందుకు థియేటర్ కు జనం పోటెత్తుత్తారు. పైగా టికెట్స్ రేట్లు పెంచడం పుష్ప 2 కు మరొక అడ్వాంటేజ్. అలాగే పుష్ప తర్వాత భారీ రేంజ్ సినిమాలు ఏవి రిలీజ్ కు రెడీగా లేవు. సో అక్కడ కూడా చాలానే సమయం దొరుకుతుంది. ఈ లెక్కన ఏ వైపు నుంచి చూసినా పుష్ప సినిమాకు బాగానే అడ్వాంటేజస్ కనిపిస్తున్నాయి. సో మొదటి షో పడితే కానీ అసలు టార్గెట్ ఫిక్స్ అవ్వదు. ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.