ANR శత జయంతి స్పెషల్.. 25 నగరాల్లో 10 చిత్రాలు రీ-రిలీజ్!

ANR 100th Birthday Special- 10 Movies Re Releasing: ప్రస్తుతం స్టార్ హీరోల బర్త్ డేస్ సందర్బంగా.. వారి బ్లాక్ బస్టర్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెలలో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు బర్త్ డే కూడా ఉంది. ఈ క్రమంలో ఆయన క్లాసిక్ మూవీస్ ను కూడా రిరీలజ్ చేయనున్నారట. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

ANR 100th Birthday Special- 10 Movies Re Releasing: ప్రస్తుతం స్టార్ హీరోల బర్త్ డేస్ సందర్బంగా.. వారి బ్లాక్ బస్టర్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెలలో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు బర్త్ డే కూడా ఉంది. ఈ క్రమంలో ఆయన క్లాసిక్ మూవీస్ ను కూడా రిరీలజ్ చేయనున్నారట. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

కథ బావుంటే స్ట్రైట్ సినిమాలు ఎలాగూ థియేటర్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కొత్తగా రీరిలీజ్ సినిమాలు కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. రీరిలీజ్ సినిమాలకు ఈ రేంజ్ లో క్రేజ్ లభిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. దీనితో స్టార్ హీరోల బర్త్ డేస్ కు.. వారి బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 20న దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు ఉంది. దీనితో ఇప్పటి తరానికి తెలియని .. అక్కినేని కల్ట్ క్లాసిక్ హిట్స్ ను థియేటర్స్ లో రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ సినిమాలేంటో.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో.. దానికి సంబంధించిన పూర్తి విషయాలను చూసేద్దాం.

ఇండస్ట్రీలో ఎప్పటికి ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టర్ గా వినిపించే పేరు.. అక్కినేని నాగేశ్వరరావు. ఈ సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరావు శత జయంతి. దీనితో ఈ స్పెషల్ డే సంధర్బంగా.. ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వ‌ర్ స్క్రీన్’.. అనే పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని.. ఫిలిం హెరిటేజ్ ఫౌండేష‌న్ నిర్ణ‌యించింది. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్ ను ప్రదర్శించనున్నారు. హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, వ‌రంగ‌ల్, కాకినాడ‌, తుమ‌కూరు, వ‌డోద‌ర‌, జ‌లంధ‌ర్‌, రూల్కెలాతో స‌హా మొత్తం 25 ప్రాంతాలలో.. స్పెషల్ షోస్ ను వేసేందుకు రెడీ చేస్తున్నారు మేకర్స్. దీనితో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

దేవదాసు, మిస్స‌మ్మ‌, భార్య‌భ‌ర్త‌లు, గుండ‌మ్మ క‌థ‌, మాయాబ‌జార్‌, డా.చ‌క్ర‌వ‌ర్తి, సుడి గుండాలు, ప్రేమ్ న‌గ‌ర్‌, ప్రేమాభిషేకం, మ‌నం.. అప్పట్లో ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పటివారికి మనం తప్ప మిగిలిన సినిమాల గురించి అంతగా తెలియకపోవచ్చు. అలాంటి కథలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ప్రతి చూడాల్సిన సినిమాలు కూడా. కాబట్టి వీటిని అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈసారి ఈ రీరిలీజ్ లకు ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments