పిల్లలకు ఇష్టమైన పాప్‌కార్న్ మేకింగ్ మెషిన్.. ఇంట్లోనే సొంతంగా చేసుకోండి!

Popcorn Making Machine For Kids Who Loves To Eat Popcorn: కరకరలాడే పాప్ కార్న్ అంటే అందరికీ ఇష్టమే. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. బయట తినాలంటే బోలెడంత ఖర్చు. పైగా అనారోగ్యం కూడా. అదే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంతో పాటు బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. కానీ ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా అని ఆలోచించేవారి కోసమే ఈ పాప్ కార్న్ మేకింగ్ మెషిన్ ని తీసుకొచ్చాము.

Popcorn Making Machine For Kids Who Loves To Eat Popcorn: కరకరలాడే పాప్ కార్న్ అంటే అందరికీ ఇష్టమే. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. బయట తినాలంటే బోలెడంత ఖర్చు. పైగా అనారోగ్యం కూడా. అదే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంతో పాటు బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. కానీ ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా అని ఆలోచించేవారి కోసమే ఈ పాప్ కార్న్ మేకింగ్ మెషిన్ ని తీసుకొచ్చాము.

పిల్లలకు పాప్ కార్న్ అంటే మహా ఇష్టం. పిల్లకేంటి ఆ మాటకొస్తే పెద్దలకు కూడా ఇష్టమే. ఒక్కసారి పాప్ కార్న్ పట్టుకున్నామంటే పట్ పట్ మంటూ లాగించేస్తూ ఉంటారు. ఎంత తిన్నా కడుపు నిండదు. ఇక మల్టీప్లెక్స్ లకి వెళ్తే పాప్ కార్న్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో అని భయపడే పరిస్థితి. పిల్లలతో వెళ్తే ఇక అంతే సంగతులు. బయట 30 రూపాయలకి దొరికే పాప్ కార్న్ కూడా మల్టీప్లెక్సుల్లో 300 పెట్టి అమ్మేస్తారు. ఏ అంటే ఇది యాపారం అంటారు. అయితే ఆ పాప్ కార్న్ కొనే డబ్బులతో పాప్ కార్న్ తయారు చేసే మెషిన్ కొనవచ్చునని మీకు తెలుసా? అవును మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్ కొనే డబ్బులతో పాప్ కార్న్ మేకింగ్ మెషినే కొనవచ్చు. దీంతో మీ పిల్లలు ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాప్ కార్న్ తినవచ్చు. దీంతో థియేటర్స్ లో పాప్ కార్న్ చూసినా కొత్తగా అనిపించదు. కాబట్టి మీ డబ్బులు కూడా ఆదా అవుతాయి.

ఎక్సెలో హాట్ ఎయిర్ పాప్ కార్న్ మెషిన్ ఒకటి ఉంది. ఇది ఎలక్ట్రిక్ మెషిన్. ఆటోమేటిక్ గా పాప్ కార్న్ తయారు చేస్తుంది. ఇది 1200 వాట్ కెపాసిటీతో పని చేస్తుంది. దీంతో ఆయిల్ అవసరం లేకుండానే పాప్ కార్న్ తయారు చేసుకోవచ్చు. ఇందులో ఒక కొలత కప్పు కూడా ఉంటుంది. మూడే మూడు నిమిషాల్లో పాప్ కార్న్ తయారు చేసుకోవచ్చు. వేడి గాలి మీద ఇది పని చేస్తుంది. దీంతో మీరు మీ పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ ని అందించవచ్చు. ఒక స్విచ్ ఉంటుంది. ఎటువంటి ఆయిల్ వాడకుండా పాప్ లైట్, ఫ్లఫ్ఫీ పాప్ కార్న్ ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ట్రాన్స్ పరెంట్ గిన్నె ఇవ్వడం వల్ల మీరు పాప్ కార్న్ తయారవుతున్నప్పుడు చూసుకోవచ్చు. మొక్కజొన్నలను మెషిన్ లో వేసి మూత పెట్టి స్విచ్ ఆన్ చేసి కాసేపు ఆగితే కరకరలాడే పాప్ కార్న్ రెడీ అయిపోతుంది. బటర్ పాప్ కార్న్, స్వీట్ పాప్ కార్న్, చీజ్పాప్ కార్న్ కావాలంటే కనుక తయారు చేసే సమయంలోనే అంటే మొదట్లోనే వెన్న, చీజ్, పంచదార పాకం యాడ్ చేసుకోవచ్చు.

దీంతో మీకు కావాల్సిన ఫ్లేవర్ పాప్ కార్న్ రెడీ అవుతుంది. 3 నిమిషాల్లో కాబట్టి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇది సౌండ్ కూడా తక్కువగా వస్తుంది. కాబట్టి ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదు. ఇది నాన్ స్టిక్ అల్యూమినియం హీట్ ఛాంబర్ తో వస్తుంది. కాబట్టి సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. ఇక ఈ పాప్ కార్న్ మెషిన్ మీద ఏడాది రీప్లేస్ మెంట్ వారంటీ ఇస్తున్నారు. ఒకవేళ ఏడాదిలో ఈ వస్తువు పాడైతే కనుక వారంటీ పాలసీ కింద కొత్త పాప్ కార్న్ మెషిన్ ఇస్తారు. ఇక దీని అసలు ధర ఆన్ లైన్ లో రూ. 4,999 ఉండగా ఆఫర్ లో రూ. 1899కే అందుబాటులో  ఉంది. మరొకటి పాప్ కార్న్ మెషిన్ కూడా ఉంది. దీని అసలు ధర రూ. 2,999 కాగా ఆఫర్ లో రూ. 1569కే అందుబాటులో  ఉంది. మరి మీ పిల్లల కోసం, మీ కోసం కరకరలాడే పాప్ కార్న్ మెషిన్ ని కొనాలని అనుకుంటున్నారా?

Show comments