Chaduvu-Sandhya: చదువు సంధ్య అంటారు.. ఈ సంధ్య ఎవరు? ఎప్పుడైనా మీకు తెలుసుకోవాలని అనిపించిందా?

చదువు సంధ్య అంటారు.. ఈ సంధ్య ఎవరు? ఎప్పుడైనా మీకు తెలుసుకోవాలని అనిపించిందా?

Chaduvu-Sandhya: చదువు-సంధ్య అని అంటూ ఉంటారు. ఐతే ఇందులో చదువు అంటే ఏంటో తెలుసు. మరి సంధ్య ఎవరో తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇవాళ్టి కథనంలో చదువు-సంధ్యలో ఉన్న సంధ్య ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు.

Chaduvu-Sandhya: చదువు-సంధ్య అని అంటూ ఉంటారు. ఐతే ఇందులో చదువు అంటే ఏంటో తెలుసు. మరి సంధ్య ఎవరో తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇవాళ్టి కథనంలో చదువు-సంధ్యలో ఉన్న సంధ్య ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు.

చదువు-సంధ్య ఈ మాట చాలా మంది వినే ఉంటారు. సినిమాల్లోనూ, అలానే పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ మాట తరచూ వింటూ ఉంటాం. ఒక ఊతపదంలా వచ్చేస్తుంటుంది. కుర్రాళ్ళు అల్లరి చిల్లరగా తిరుగుతుంటే.. ఏరా చదువు-సంధ్య లేదా అని అంటారు. అల్లరి చిల్లరగా తిరిగే ఒక కుర్రాడిని పరిచయం చేయాలంటే.. వాడా చదువు-సంధ్య లేని వాడు సార్ అని అంటారు. ఏ ముదురు కుర్రాడో అయితే.. చదువు లేదు గానీ సార్ సంధ్య ఉంది సార్ అని గర్ల్ ఫ్రెండ్ ని చూపిస్తాడు. నిజంగా సంధ్య అంటే అమ్మాయా? అసలీ సంధ్య ఎవరు? చదువు ఉంటే సంధ్య అనే అమ్మాయి వస్తుందని అలా అంటున్నారా? అంటే బాగా చదువుకుని సెటిల్ అయితే సంధ్య లాంటి అమ్మాయి వస్తుందని అంటున్నారా? చదువుతో పాటు సంధ్య అనే అమ్మాయి ఉండాలని అంటున్నారా? చదువు-సంధ్య లేకపోతే ఇక జీవితం వృధానా? అసలు చదువు-సంధ్యలో ఆ సంధ్య ఎవరో చెప్పండయ్యా? అని డీజేలో అల్లు అర్జున్ లా అడగాలని అనిపించిందా? ఈ చదువు-సంధ్యలో సంధ్య అంటే ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని మీకు అనిపించిందా? 

సంధ్య అంటే అమ్మాయి కాదు:

సంధ్య అంటే అనువర్తనం. ఇంగ్లీష్ లో అప్లికేషన్ అని అంటారు. చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది. అయితే చదువు ఒకటే ఉంటే సరిపోదు. సంధ్య కూడా ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలు ఈ నానుడిని సృష్టించారు. సంధ్య అంటే ప్రవర్తన అని కూడా అంటారు. ఏ కాలంలో ఏ పద్ధతిలో ఎలా ప్రవర్తించాలో నేర్పే ఒక వ్యవస్థని సంధ్య అని అంటారు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని సూచించడానికి సంధ్య అనే పదాన్ని వాడతారు. మంచి ప్రవర్తన లేదా? మంచి నడవడిక లేదా? మంచి అనువర్తనం లేదా? అని అనడానికి ఏరా సంధ్య లేదా అని అంటారు. 

సంధ్య అంటే మెడిటేషన్ అని, దేవుడ్ని ఆరాధించడం అని కూడా అర్థం వస్తుంది. అంటే దేవుడ్ని ఆరాధించేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు పద్ధతిగా ఉంటారని.. ఈ రెండు అలవాట్లు లేని వాళ్ళ ప్రవర్తన బాగోదని సంధ్య లేదా అని అంటారు. చదువు, సంధ్య రెండూ ఉంటే ఆ మనిషి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని.. చదువు ఒకటే ఉండి సంధ్య లేకుంటే ఎదగడం కష్టమని అంటారు. విజ్ఞానానికి వికాసం తోడైతేనే ఏదైనా సాధ్యమని చెప్పడానికి ‘చదువు-సంధ్య’ అనే నానుడిని తీసుకొచ్చారు. విజ్ఞానానికి చదువు ఎంత అవసరమో.. మనిషి ఎదుగుదలకు వ్యక్తిత్వ వికాసం కూడా అంతే అవసరం. ఈ క్రమంలో చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, మంచి నడవడిక వంటివి ఉండాలి. వీటన్నిటినీ జీవితానికి అప్లై చేసుకోవడమే అనువర్తనం. అదే సంధ్య.

Show comments