Group-3 అభ్యర్థులకు అలర్ట్.. టీజీపీఎస్సీ కీలక నిర్ణయం.. అదేంటంటే?

TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అదేంటంటే?

TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అదేంటంటే?

తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. దరఖాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లుంటే సవరణలు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకునేందుకు సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు అవకాశం కల్పించింది. అప్లికేషన్ లో తప్పులు దొర్లిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు. గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ 2022లో విడుదలైంది. దీని ద్వారా 1,388 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఈ మొత్తం ఖాళీల్లో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు-680 కాగా.. సీనియర్ అకౌంటెంట్ పోస్టులు 436 ఖాళీలున్నాయి. మొత్తం 1,388 గ్రూప్-3 పోస్టులకుగాను 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక గ్రూప్ 3 పరీక్షలు ఈ ఏడాది నవంబర్ 17,18 తేదీల్లో జరుగనున్నాయి. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి త్వరలో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగనుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments