విద్యార్థులకు వరం పీఎం విద్యాలక్ష్మి స్కీమ్.. ఏకంగా రూ. 7.5 లక్షలు పొందే ఛాన్స్..

PM Vidyalaxmi Scheme: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా ఏకంగా రూ. 7.5 లక్షలు పొందే ఛాన్స్ విద్యార్థులకు కల్పించింది.

PM Vidyalaxmi Scheme: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా ఏకంగా రూ. 7.5 లక్షలు పొందే ఛాన్స్ విద్యార్థులకు కల్పించింది.

సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక చదువుకు దూరమవుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. డబ్బు లేని కారణంగా చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మరికొంత మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా ఆర్థిక కారణాలతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. చదువును ఆపేసి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. ఆర్థిక సాయం అందించే పథకాలను తీసుకొస్తూ అండగా నిలుస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్స్, విద్యా రుణాలను అందిస్తూ ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తున్నాయి.

విదేశాల్లో చదువుకునేందుకు కూడా తక్కువ వడ్డీకే లక్షల్లో లోన్స్ అందిస్తూ సాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. విద్యార్థులకు లోన్స్ అందించేందుకు పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ‘విద్యాలక్ష్మి పథకం’ ద్వారా లోన్స్ పొందవచ్చు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 3,600 కోట్లను కేటాయించింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులు రూ. 7.5 లక్షల లోన్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రూ. 7.5 లక్షల లోన్ పొందొచ్చు. ఈ రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది.

దీంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. పీఎం విద్యాలక్ష్మీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో లోన్స్ లభించనున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే మెరిట్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండనున్నది. లక్షలాది మంది విద్యార్థులకు లాభం చేకూరనున్నది. అయితే ఈ పథకం ద్వారా లోన్ పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలని తెలిపింది. రూ.10లక్షల వరకు రుణాలపై రూ.3శాతం వడ్డీరాయతీ కల్పించనున్నారు.

ఏదైనా ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం విద్యా లక్ష్మీ పథకాన్ని యూజ్ చేసుకుని మీ ఉన్నత విద్యను పూర్తి చేసుకోవచ్చు. మీ కలల జీవితాన్ని సాకారం చేసుకోవచ్చు. మరి విద్యార్థులకు వరంగా మారిన పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments