HCL TechBee program: ఇంటర్‌ పాసయ్యారా? సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌ కు ఇప్పుడే అప్లై చేసుకోండి.. 2 లక్షల జీతం

ఇంటర్‌ పాసయ్యారా? సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌ కు ఇప్పుడే అప్లై చేసుకోండి.. 2 లక్షల జీతం

HCL TechBee program: మీరు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే సాఫ్ట్ వేర్ జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఇంటర్ అర్హతతో సాఫ్ట్ వేర్ జాబ్ ను సొంతం చేసుకోవచ్చు.

HCL TechBee program: మీరు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే సాఫ్ట్ వేర్ జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఇంటర్ అర్హతతో సాఫ్ట్ వేర్ జాబ్ ను సొంతం చేసుకోవచ్చు.

ఇంటర్ పూర్తయ్యాక చాలా మంది ఉన్నత విద్యను అభ్యసించేందుకు రెడీ అవుతుంటారు. కొందరు సాధారణ డిగ్రీలు, మరికొందరు టెక్నికల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్యా కోర్సులు చేస్తుంటారు. తక్కువ సమయంలోనే మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేరుతుంటారు. ఇంకొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ సరిగా లేక ఏదైనా జాబ్ చేయాలని చూస్తుంటారు. అయితే ఇంటర్ అర్హతతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ కారణంతో ఇంటర్ పూర్తైన వారు ఉద్యోగాలు లేవని తీవ్ర నిరాశ చెందుతుంటారు. ఇలాంటి వారికి ప్రముఖ ఐటీ కంపెనీ ఎగిరిగంతేసే శుభవార్తను అందించింది. మీరు ఇంటర్ పాసైతే చాలు సాఫ్ట్ వేర్ జాబ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు ఇంటర్మీడియట్ పాసై ఖాళీగా ఉన్నారా? మంచి ఉద్యోగం లభిస్తే బాగుండని ఆలోచిస్తున్నారా? మీలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్ సీఎల్. ఇంటర్ అర్హతతో సాఫ్ట్ వేర్ జాబ్స్ ఇచ్చేందుకు ప్రక్రియను ప్రారంభించింది హెచ్ సీఎల్. టెక్‌బీ పేరుతో హెచ్‌సీఎల్‌ ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్‌ సపోర్ట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నది. ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులవుతారని ఓ ప్రకటనలో తెలిపింది. శిక్షణ మధురై, చెన్నై హెచ్‌సీఎల్‌ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇందులో మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ ఉంటుంది.

ఆ తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్‌ అందిస్తూ హెచ్ సీఎల్ సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది. స్టైపెండ్‌ కింద నెలకు రూ.10 వేలు అందిస్తారు. సంవత్సరకాలంపాటు పాటు సాగే ప్రోగ్రామ్‌ ముగిసన తర్వాత హెచ్‌సీఎల్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత ఏటా రూ. 1.7 లక్షలు నుంచి రూ. 2 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. ఇంటర్మీడియట్‌ సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్‌ కోర్సుల్లో 75 శాతానికి పైగా మార్కులు కలిగిన వారు అప్లై చేసుకునేందుకు అర్హులు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments