ECILలో జాబ్స్.. రాత పరీక్ష లేదు.. వెంటనే అప్లై చేసుకోండి

ECIL Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ECIL Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. మీరు రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. జాబ్ పొందాలంటే రాతపరీక్షలు, ఇంటర్య్వూలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలాంటి పరీక్ష లేకుండా ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇటీవల హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీల సంఖ్య: 437

  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162
  • ఎలక్ట్రీషియన్- 70
  • ఫిట్టర్- 70
  • మెకానిక్ (ఆర్‌ అండ్‌ ఏసీ)- 17
  • టర్నర్- 17
  • మెషినిస్ట్- 17
  • మెషినిస్ట్ (గ్రైండర్)- 13
  • సీఓపీఏ- 45
  • వెల్డర్- 22
  • పెయింటర్- 4

అర్హత:

  • సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి:

  • 31.10.2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం:

  • ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్‌ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్‌, హైదరాబాద్.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:

  • 13-09-2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

  • 29-09-2024
Show comments