IDBI Bank Recruitment 2024: BTech పాసైతే చాలు.. బ్యాంక్ ఉద్యోగాలు రెడీ.. వెంటనే అప్లై చేసుకోండి

BTech పాసైతే చాలు.. బ్యాంక్ ఉద్యోగాలు రెడీ.. వెంటనే అప్లై చేసుకోండి

IDBI Bank Recruitment 2024: మీరు బీటెక్ పాసయ్యారా? ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ప్రముఖ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

IDBI Bank Recruitment 2024: మీరు బీటెక్ పాసయ్యారా? ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ప్రముఖ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి గోల్డెన్ ఛాన్స్. ఇటీవల భారీ స్థాయిలో బ్యాంక్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. వేల సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. ఉద్యోగం కోసం నిరీక్షిస్తున నిరుద్యోగులకు మళ్లీ రాని అవకాశమిది. మరి మీరు కూడా బ్యాంక్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? మీరు బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే ఈ బ్యాంక్ జాబ్స్ మీకోసమే. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 31 పోస్టులను భర్తీ చేమనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి 25 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి దరఖాస్తుల ప్రిలిమినరీ స్ర్కీనింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య: 31

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గ్రేడ్‌-డి: 03 పోస్టులు

అసిస్టెంట్ జనరల్‌ మేనేజర్‌ గ్రేడ్‌-సి: 15 పోస్టులు

మేనేజర్‌ గ్రేడ్‌-బి: 13 పోస్టులు

అర్హత:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి బీటెక్ / బీఈ, చార్టర్డ్ అకౌంటెంట్, గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి 25 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • పోస్టును అనుసరించి దరఖాస్తుల ప్రిలిమినరీ స్క్రీనింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పే స్కేల్:

  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గ్రేడ్‌-డి పోస్టులకు నెలకు రూ.1,90,000; అసిస్టెంట్ జనరల్‌ మేనేజర్‌ గ్రేడ్‌-సి పోస్టులకు నెలకు రూ.1,57,000; మేనేజర్‌ గ్రేడ్‌-బి పోస్టులకు నెలకు రూ.1,19,000 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 01-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 15-07-2024
Show comments