గోల్డెన్ ఛాన్స్.. ECILలో 1100 జాబ్స్.. నెలకు రూ.22,528 జీతం

మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఈ నోటిఫికేషన్ ను అస్సలు వదలకండి. ఈసీఐఎల్ లో 1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల కోసం నోటిఫిషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 22,528 జీతాన్ని అందిస్తారు.

మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఈ నోటిఫికేషన్ ను అస్సలు వదలకండి. ఈసీఐఎల్ లో 1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల కోసం నోటిఫిషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 22,528 జీతాన్ని అందిస్తారు.

నిరుద్యోగులకు భారీ శుభవార్త. మీరు ఐటీఐ ఉత్తీర్ణులై ఖాళీగా ఉంటున్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 22,528 జీతాన్ని అందుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వెంటనే అప్లై చేసుకోండి.

ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1100 జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 275 ఎలక్ట్రానిక్స్ మెకానిక్​ పోస్టులు, 275 ఎలక్ట్రీషియన్​ పోస్టులు, 550 ఫిట్టర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్​/ ఎలక్ట్రీషియన్​/ ఫిట్టర్​ ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి. దీని తరువాత ఏడాది పాటు అప్రెంటిస్​గా పనిచేసి ఉండాలి. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏడాది పాటు పనిచేసిన అనుభవం కూడా తప్పనిసరి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 16 వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈసీఐఎల్ అధికారిక వెబ్ సైట్ https://www.ecil.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ మొత్తం:

  • 1100

ట్రేడుల వారీగా ఖాళీలు:

ఎలక్ట్రానిక్స్ మెకానిక్​ పోస్టులు

  • 275

ఎలక్ట్రీషియన్​ పోస్టులు

  • 275

ఫిట్టర్ పోస్టులు

  • 550

అర్హత:

  • అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్​/ ఎలక్ట్రీషియన్​/ ఫిట్టర్​ ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులను ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్‌తో పాటు ఎక్స్​పీరియన్స్​ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.22,528 చొప్పున జీతం అందిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 10-01-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 16-01-2024

ఈసీఐఎల్ అధికారిక వెబ్ సైట్:

Show comments