ఈ అర్హతలుంటే చాలు.. పరీక్ష రాయకుండానే జాబ్.. నెలకు 1,37,050 జీతం

ఈ అర్హతలుంటే చాలు.. పరీక్ష రాయకుండానే జాబ్.. నెలకు 1,37,050 జీతం

Civil Assistant Surgeon Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పరీక్ష రాయకుండానే ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,37,050 జీతం అందుకోవచ్చు.

Civil Assistant Surgeon Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పరీక్ష రాయకుండానే ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,37,050 జీతం అందుకోవచ్చు.

ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సాధించడం కష్టంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ విపరీతంగా ఉంది. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే లక్షలాది మంది పోటీపడుతున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలల్లో మెరుగైన ప్రదర్శన చేస్తే తప్పా జాబ్ వచ్చే అవకాశం లేదు. ఇలాంటి తరుణంలో అసలు పరీక్ష రాయకుండానే ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. తెలంగాణ వైద్యారోగ్యశాఖలో పలు జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. ఈ అర్హతులున్న వారు అప్లై చేసుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 435 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో సభ్యత్వం కలిగి ఉండాలి. 18-46 ఏళ్ల వయసును కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న వారు జులై 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల సంఖ్య: 435

విభాగాలవారీగా ఖాళీలు:

  • డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 431 పోస్టులు
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్: 04 పోస్టులు

అర్హత:

  • ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో సభ్యత్వం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2024 నాటికి 18 – 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఫీజు:

  • దరఖాస్తు ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.120 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్.

ఎంపిక విధానం:

  • ఎంబీబీఎస్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.58,850 – రూ.1,37,050 జీతం అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 02-07-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 11-07-2024
Show comments