P Venkatesh
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హతలు ఏంటంటే?
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హతలు ఏంటంటే?
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇటీవల ఏపీ కేబినెట్ ఉద్యోగాల భర్తీ కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి 6100 పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. అటవీ శాఖలో కూడా 689 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను విడుదల చేయగా దానికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యూలర్ ప్రాతిపదికన డైరెక్ట్/లేటరల్ ఎంట్రీలోఅసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ లో 255 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హుత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://dme.ap.nic.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.