ఇంటర్ అర్హతతో ఎయిర్‌పోర్ట్ లో జాబ్స్.. మంచి వేతనం.. వెంటనే అప్లై చేసుకోండి

ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతోనే ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు పొందే ఛాన్స్. మంచి వేతనం తెచ్చిపెట్టే ఈ జాబ్స్ ను అస్సలు వదులుకోకండి.

ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతోనే ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు పొందే ఛాన్స్. మంచి వేతనం తెచ్చిపెట్టే ఈ జాబ్స్ ను అస్సలు వదులుకోకండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మంచి వేతనం తెచ్చిపెట్టే ఈ జాబ్స్ ను అస్సలు వదలొద్దు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఇంటర్ పాసైతే చాలు. ఇటీవల న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్‌ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1,074 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీ చేయనున్నది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఆన్ లైన్ లో అప్లై చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం :

  • ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) పోస్టులు:
  • 1,074

అర్హత:

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, ఇంటర్‌/12వ తరగతి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 అందుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు:

  • రూ.350 చెల్లించాలి.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తుల ప్రారంభ తేదీ:

  • 06-03-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 22-05-2024
Show comments