Dharani
పదో తరగతి పాసయ్యారు.. అయితే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. పైగా ఈ జాబ్ వస్తే.. రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పని చేస్తే సరిపోతుంది. ఆ వివరాలు..
పదో తరగతి పాసయ్యారు.. అయితే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. పైగా ఈ జాబ్ వస్తే.. రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పని చేస్తే సరిపోతుంది. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో ఉద్యోగం రావాలంటే కచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. ప్రైవేటు రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే.. డిగ్రీతో పాటు మరి కొన్ని ఇతర కోర్సులు కూడా నేర్చుకుని ఉండాలి. ఇవన్ని ఉన్నా ఉద్యోగం వస్తుందా అంటే.. కష్టమే అని చెప్పవచ్చు. ఇక చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే కొన్ని జాబులకు మాత్రం పదో తరగతి, ఇంటర్ విద్యార్హత ఉన్నా సరిపోతుంది. అలాంటి ఓ జాబ్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. పదో తరగతి పాస్ అయితే చాలు గవర్నమెంట్ జాబ్.. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరవచ్చు. నాలుగు గంటలు మాత్రమే పని.. పైగా దీనికి ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. మరి ఇంతకు ఆ ఉద్యోగం ఏంటి అంటే..
పోస్టల్ శాఖ.. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో.. జీడీఎస్ నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాదికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల కానుంది. జీడీఎస్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత. టెన్త్ క్లాస్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారనే సంగతి తెలిసిందే.
ఇక ఈ పోస్టులకు సంబంధించి భర్తీ విషయంలో.. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం) అసిస్టెంట్ బ్రాంచ్‌పోస్టు మాస్టర్(ఏబీపీఎం) డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి ఈ ఉద్యోగాలకు వేతనం రూ.10-రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది.
ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన తర్వాత రోజుకు కేవలం నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులు భర్తి చేస్తారు.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. వీటికి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. చివరి తేదీ వంటి వివరాలు తెలియాలంటే.. పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.