కాంపిటీషన్ లేని ఉద్యోగాలు.. నెలకు 2 లక్షల వరకు జీతం.. అర్హులు వీరే

RMLH Recruitment 2024: గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

RMLH Recruitment 2024: గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని జాబ్స్ కు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. వందల్లో జాబ్స్ ఉంటే లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గవర్నమెంట్ జాబ్ సాధించడం కష్టంగా మారింది. అసాధారణ ప్రతిభ.. డెడికేషన్.. స్కిల్స్ ఉంటే తప్పా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే చాలా తక్కువ పోటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 2 లక్షల వరకు జీతం అందుకోవచ్చు. ఇంతకీ అర్హులు ఎవరంటే?

అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు నెలకు రూ.67,700-రూ.2,08,700 వరకు జీతం అందిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల సంఖ్య: 140

విభాగాలవారీగా ఖాళీలు:

ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌(బ్లడ్ బ్యాంక్): 04

కార్డియాక్ అనస్థీషియా: 04

ఎండోక్రైనాలజీ: 05

ఫోరెన్సిక్ మెడిసిన్: 01

గ్యాస్ట్రోఎంటరాలజీ: 03

ఒబెస్ట్రిక్స్ & గైనకాలజీ: 05

మెడిసిన్: 12

మైక్రోబయాలజీ: 01

నియోనాటాలజీ: 14

ఆఫ్తాల్మాలజీ: 03

ఆర్థోపెడిక్స్: 02

పీడియాట్రిక్స్: 17

పాథాలజీ: 06

పీఎంఆర్‌: 01

రేడియాలజీ: 09

అర్హత:

  • అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా/డీఎన్‌బీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సెంట్రల్‌ డైరీ అండ్‌ డిస్పాచ్‌ సెక్షన్, గేట్‌ నెం.3 దగ్గర, ఏబీవీఐఎంఎస్‌ అండ్‌ డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌, న్యూదిల్లీ చిరునామాకు పంపాలి.

ఎంపిక విధానం:

  • స్క్రీనింగ్‌ టెస్ట్‌/ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.67,700-రూ.2,08,700.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 29-06-2024
Show comments