ఈ అర్హతలుంటే చాలు.. ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ తక్కువ.. నెలకు 1. 75 లక్షల జీతం

National Biodiversity Authority Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1.75 లక్షల జీతం పొందొచ్చు.

National Biodiversity Authority Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1.75 లక్షల జీతం పొందొచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ తక్కువ. ఈ ఉద్యోగాలకు పోటీపడాలంటే ఈ అర్హతలుంటే చాలు. ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1.75 లక్షల వరకు జీతం పొందొచ్చు. ఇటీవల చెన్నైలోని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అర్హతలు ఏంటి? ఎలా ఎంపిక చేస్తారు? ఆ వివరాలు మీకోసం.

నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ సైంటిఫిక్ కన్సల్టెంట్ గ్రేడ్ 1,2,3,4, సీనియర్ యంగ్ ప్రొఫెషనల్స్(సైంటిఫిక్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. బొటనీ/జువాలజీ/కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/ హార్టికల్చర్/ అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/ మెరైన్ సైన్స్/ ఫిషరీస్ విభాగాల్లో పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి 35 నుంచి 62 ఏళ్లు మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య:10

పోస్టుల వివరాలు:

సైంటిఫిక్ కన్సల్టెంట్(గ్రేడ్ 4): 01

సైంటిఫిక్ కన్సల్టెంట్(గ్రేడ్ 3):02

సైంటిఫిక్ కన్సల్టెంట్(గ్రేడ్ 2):02

సైంటిఫిక్ కన్సల్టెంట్(గ్రేడ్ 1):03

సీనియర్ యంగ్ ప్రొఫెషనల్(సైంటిఫిక్):02

అర్హత:

  • బొటనీ/జువాలజీ/కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/ హార్టికల్చర్/ అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/ మెరైన్ సైన్స్/ ఫిషరీస్ విభాగాల్లో పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి 35 నుంచి 62 ఏళ్లు మించకూడదు.

ఎంపికవిధానం:

  • ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి రూ. 70 వేల నుంచి రూ. 1.75 లక్షల జీతం వరకు పొందొచ్చు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు చివరి తేదీ:

  • 20-07-2024
Show comments