P Venkatesh
Indian Oil Corporation apprentice recruitment 2024: ఇండియన్ ఆయిల్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రాత పరీక్ష లేకుండానే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు.
Indian Oil Corporation apprentice recruitment 2024: ఇండియన్ ఆయిల్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రాత పరీక్ష లేకుండానే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు.
P Venkatesh
ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లో జాబ్స్ కు కాంపిటీషన్ హెవీగా ఉంది. మంచి జీతంతో కూడిన ఉద్యోగం కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్పెషల్ స్కిల్స్ కూడా ఉండాల్సిందే. ఇటీవల రైల్వే, రక్షణ సంస్థల నుంచి భారీగా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. జాబ్ కొట్టేందుకు ఇదే మంచి ఛాన్స్. మరి మీరు కూడా జాబ్ సెర్చ్ లో ఉన్నారా? డిగ్రీలు, పీజీలు చేసి ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? జాబ్ కోసం వెతికి విసిగిపోయారా? ఎంత వెతికినా జాబ్ దొరకడం లేదా? జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్.
చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తీపికబురును అందించింది. అప్రెంటిస్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాత పరీక్ష రాయకుండానే జాబ్ సొంతం చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 240 పోస్టులను భర్తీ చేయనున్నది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీకానున్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు.
అప్రెంటిస్ శిక్షణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోనూ అందించబడుతుంది. అభ్యర్థులకు సంవత్సరంపాటు శిక్షణ అందిస్తారు. ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ (బీఏ/బీఎస్సీ/బీకామ్/బీబీఏ/బీసీఏ/బీబీఎం) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్రెంటిస్ శిక్షణ కోసం మెరిట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిప్లొమా (టెక్నీషియన్) అభ్యర్థులకు నెలకు రూ.10,500, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.11,500 స్టైఫండ్ చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి గల వారు నవంబరు 29 తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం IOCL అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.