RRC Central Railway Apprentice Recruitment 2024: జాబ్ లేదని టెన్షన్ పడుతున్నారా?.. రైల్వేలో 2,424 జాబ్స్ మీకోసమే.. మిస్ చేసుకోకండి

జాబ్ లేదని టెన్షన్ పడుతున్నారా?.. రైల్వేలో 2,424 జాబ్స్ మీకోసమే.. మిస్ చేసుకోకండి

RRC Central Railway Apprentice Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వేలో 2424 జాబ్స్ రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

RRC Central Railway Apprentice Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వేలో 2424 జాబ్స్ రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

చదువు కంప్లీట్ అయ్యాక ఇటు ఇంట్లో వాళ్లు, బయట వాళ్లు, ఫ్రెండ్స్ నెక్ట్స్ ఏంటి అంటూ అడిగేస్తుంటారు. జాబ్ ఏం చేయట్లేదా.. ఎక్కడైనా జాబ్ చూసుకోవచ్చుగా అంటూ సలహాలిస్తుంటారు. కొన్ని సార్లు ఇంట్లో వాళ్లు ఇంకెన్నాళ్లు ఖాళీగా ఉంటావు ఉద్యోగం చూసుకోవచ్చుగా అంటూ చివాట్లు పెడుతుంటారు. మరి మీరు కూడా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీరు ఇక జాబ్ లేదని టెన్షన్ పడాల్సిన పని లేదు. రైల్వేలో 2424 జాబ్స్ రెడీగా ఉన్నాయి. పదో తరగతి అర్హతతోనే రైల్వేలో జాబ్ పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

ఇటీవల రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ రైల్వే ఏకంగా 2424 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పరీక్ష లేదా తత్సమాన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా గుర్తింపు పొందిన బోర్డు నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 15 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థుల వయసు 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 2424

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పరీక్ష లేదా తత్సమాన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా గుర్తింపు పొందిన బోర్డు నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయోపరిమితి 15.7.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. టెన్త్, ఐటీఐలో సాధారణ సగటు మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 16-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 15-08-2024
Show comments