P Venkatesh
Bank of Maharashtra Apprentice Recruitment 2024: మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రముఖ బ్యాంక్ 600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.
Bank of Maharashtra Apprentice Recruitment 2024: మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రముఖ బ్యాంక్ 600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
బ్యాంక్ జాబ్స్ కు కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. బ్యాక్ జాబ్ సాధించేందుకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. కోచింగ్ సెంటర్లలో చేరి పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. బ్యాంక్ జాబ్ అయితే ఒత్తిడి ఉండదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు. అన్నీటికి మించి సెలవులు ఎక్కువగా ఉంటాయి. మంచి జీతం. ఈ కారణాలతో యూత్ అంతా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. బ్యాంక్ కొలువులు కొట్టాలంటే అంత ఈజీ కాదు. రాత పరీక్షలు రాయాలి. ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి. అన్ని దశలను దాటితే తప్పా ఉద్యోగం వరించదు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. రాత పరీక్ష లేకుండానే మీరు బ్యాంక్ జాబ్ ను సొంతం చేసుకోవచ్చు. అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 30 నాటికి 20-28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అర్హులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్ పిరియడ్ లో అప్రెంటీస్లకు నెలకు రూ.9000 స్టైపెండ్ అందిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలు చూసినట్లైతే.. అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.150 + జీఎస్‌టీ, ఎస్టీ, ఎస్సీలు రూ.100 + జీఎస్‌టీ చెల్లించాలి. దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం bankofmaharashtra.inను సంప్రదించాల్సి ఉంటుంది.