9,995 Bank ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? రేపే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేసుకోండి

IBPS RRB Notification 2024: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. 9995 బ్యాంక్ జాబ్స్ కు రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. ఇంక అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి.

IBPS RRB Notification 2024: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. 9995 బ్యాంక్ జాబ్స్ కు రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. ఇంక అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారు ఈ అవకాశాన్ని వదులుకోకండి. గ్రామీణ బ్యాంకుల్లో 9,995 బ్యాంక్ ఉద్యోగాలకు రేపు ఒక్కరోజే ఛాన్స్. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోని వారు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. మళ్లీ రాని ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ 9,995 బ్యాంకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ జాబ్స్ కు దరఖాస్తు ప్రక్రియ జూన్07 నప్రారంభం కాగా జూన్ 27తో అంటే రేపటితో ముగియనున్నది.

జాతీయ స్థాయిలో గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-సీఆర్‌పీ నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9,995 గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్ (స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,149 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య:

  • 9,995

విభాగాల వారీగా ఖాళీలు:

ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌): 5585

ఆఫీస‌ర్ (స్కేల్‌-1): 3499

ఆఫీస‌ర్ (స్కేల్‌-2): 782

ఆఫీస‌ర్ (స్కేల్‌-3): 129 

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టుల వివరాలు:

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 570

ఆఫీసర్ స్కేల్-1: 525

ఆఫీసర్ స్కేల్-2: 46

ఆఫీసర్ స్కేల్-3: 08

అర్హతలు:

  • పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి.

ఎంపిక విధానం:

  • ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 07-06-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 27-06-2024
Show comments