AP Animal Husbandry Department Recruitment 2023 : ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందించింది. పశుసంవర్ధక శాఖలో ఉన్న 1896 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందించింది. పశుసంవర్ధక శాఖలో ఉన్న 1896 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తోది. ఇప్పటికే పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను విడుదల చేయగా తాజాగా పశుసంవర్ధక శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. నేడు పశు సంవర్ధక శాఖలో ఉన్న 1896 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్‌ఏ)పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీ పశుసంవర్ధక శాఖలోని ఉద్యోగ ఖాళీల కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1896 ఉద్యోగాల కోసం నేటి నుంచే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నిర్ధేశిత ఫీజును డిసెంబర్‌ 10వ తేదీలోగా చెల్లించాలి. అభ్యర్థులకు డిసెంబర్‌ 27న హాల్‌టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్‌ 31వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ahd.aptonline.in, https://apaha-recruitment.aptonline.in సందర్శించి తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

ఏపీ పశుసంవర్ధక శాఖ

మొత్తం పోస్టులు
1896

ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు

అనంతపురం 473, చిత్తూరు 100, కర్నూలు 252, వైఎస్సార్‌ 210, నెల్లూరు 143, ప్రకాశం 177, గుంటూరు 229, కృష్ణా 120, పశ్చిమ గోదావరి 102, తూర్పు గోదావరి 15, విశాఖపట్నం 28, విజయనగరం 13, శ్రీకాకుళం 34.

వయోపరిమితి

అభ్యర్థులు 18–42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి

వేతనం

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్‌ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్‌ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 వేతనం అందిస్తారు.

విద్యార్హతలు

అభ్యర్థి నిర్దేశించిన విద్యార్హతలను కలిగి ఉండాలి
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి పోస్ట్.
1) శ్రీ నిర్వహించిన రెండు సంవత్సరాల పశు సంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు
వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి.
2) డైరీయింగ్ మరియు పౌల్ట్రీ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు ఒకటి

3) డైరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌తో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు
చదువు
4) ఇంటర్మీడియట్ (APOSS) పాడిపరిశ్రమను ఒక వృత్తిపరమైన సబ్జెక్ట్‌గా కలిగి ఉండాలి.
5) B.Sc (డైరీ సైన్స్)
6) సబ్జెక్ట్ స్టడీలో ఒకటిగా డైరీ సైన్స్‌తో BSc
7) MSc (డైరీ సైన్స్)
8) డిప్లొమా వెటర్నరీ సైన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ విద్య.
9) బి.టెక్ (డైరీ టెక్నాలజీ)
10) SVVU యొక్క డైరీ ప్రాసెసింగ్‌లో డిప్లొమా
11) భారత్ సేవక్ సమాజ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా
పరీక్షలు.
12) B.పాడి పరిశ్రమ & పశుసంవర్ధక వృత్తిపరమైన కోర్సు

ఫీజు

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం

ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభం

20-11-2023

దరఖాస్తు చివరి తేదీ

11-12-2023

అధికారిక వెబ్ సైట్

https://apaha-recruitment.aptonline.in/#

Show comments