T20 వరల్డ్ కప్​కు భారత జట్టు సెలక్షన్ అయిపోయిందా? ఆ ఒక్కడికి తప్ప అందరికీ ఛాన్స్!

టీ20 వరల్డ్ కప్​కు వెళ్లబోయే భారత జట్టు ప్రకటన గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జట్టులో ఎవరెవరు ఉంటారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

టీ20 వరల్డ్ కప్​కు వెళ్లబోయే భారత జట్టు ప్రకటన గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జట్టులో ఎవరెవరు ఉంటారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

క్రికెట్ అభిమానులు అంతా ఇప్పుడు ఐపీఎల్-2024 ట్రాన్స్​లో ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్​లో ఒకదాన్ని మించి ఒకటి ఉత్కంఠభరితంగా మ్యాచులు సాగుతుండటంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే సగం సీజన్ అయిపోయింది. ఇంకొన్ని వారాల్లో మిగిలిన సీజన్ కూడా కంప్లీట్ అవుతుంది. అయితే అక్కడితో ఫ్యాన్స్​ ఎంజాయ్​మెంట్​కు ఫుల్​స్టాప్ ఏమీ పడదు. వాళ్లను మరింత ఎంటర్​టైన్ చేసేందుకు జూన్ నెలలో పొట్టి ప్రపంచ కప్ రూపంలో మరో మెగా టోర్నమెంట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని జట్లు వరల్డ్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి. టీమిండియా ప్లేయర్లు మాత్రం ఐపీఎల్ బిజీలో ఉన్నారు. త్వరలో మెగా టోర్నీ కోసం టీమ్​ను ప్రకటించాల్సి ఉంది. అయితే జట్టును ఇప్పటికే సెలక్ట్ చేసేశారని తెలుస్తోంది.

వరల్డ్ కప్​కు వెళ్లే భారత టీమ్​కు సంబంధించి ఓ బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రపంచ కప్​ జట్టును ఇప్పటికే సెలక్టర్లు ఎంపిక చేశారట. దీని ప్రకారం.. మెగా టోర్నీకి 20 మందితో కూడిన ఆటగాళ్ల బృందంతో టీమిండియా బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. అందులో 15 మంది స్క్వాడ్​లో ఉండగా.. మరో 5 మంది స్టాండ్​బైస్​గా ఉంటారని క్రికెట్ వర్గాల సమాచారం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారట. వాళ్లకు బ్యాకప్​గా యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్ ఉంటారని వినికిడి. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్​తో బ్యాటింగ్ యూనిట్ ముందుకెళ్తుందని అంటున్నారు. ఫినిషర్ రోల్​కు బ్యాకప్​గా శివమ్ దూబె ఉంటాడని సమాచారం. పంత్​కు బ్యాకప్​ వికెట్ కీపర్​గా సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పేర్లు కూడా స్క్వాడ్​లో ఉన్నాయట.

స్పిన్ ఆల్​రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వ్యహరించనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ కన్ఫర్మ్ అని టాక్. పేస్ బాధ్యతల్ని జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్​దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ పంచుకుంటారని వినికిడి. అయితే బ్యాటింగ్, బౌలింగ్​లో తరచూ ఫెయిలవుతున్న హార్దిక్​ పేరు ఈ లిస్ట్​లో ఉన్నా.. విధ్వంసక బ్యాటింగ్​తో చెలరేగుతున్న సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్​కు మాత్రం ఇందులో చోటు దక్కలేదని సమాచారం. ఒక్క డీకేని మాత్రమే సెలక్టర్లు సీరియస్​గా తీసుకోలేదట. దానికి వయసే కారణమని తెలుస్తోంది. అతడ్ని తీసుకోవాలని రోహిత్​కు కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం మరో రీజన్ అని టాక్ నడుస్తోంది. అయితే బీసీసీఐ ఇంకా అధికారికంగా భారత జట్టును ప్రకటించలేదు. అప్పటిదాకా స్క్వాడ్​ ఇదేనని కన్ఫర్మ్​గా చెప్పలేం. మరి.. టీ20 వరల్డ్ కప్ టీమ్​లో ఎవరెవరు ఉండాలని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments