Nidhan
సాధారణ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్థాయికి చేరాడు. బ్యాటర్‌గా, సారథిగా ఎంతో సక్సెస్ చూశాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో హిట్‌మ్యాన్ రివీల్ చేశాడు.
సాధారణ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్థాయికి చేరాడు. బ్యాటర్‌గా, సారథిగా ఎంతో సక్సెస్ చూశాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటో హిట్‌మ్యాన్ రివీల్ చేశాడు.
Nidhan
సాధారణ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. కెరీర్ ఆరంభంలోనే టీ20 కప్ వరల్డ్ కప్‌ను ముద్దాడాడు. ఆ తర్వాత బ్యాటర్, సారథిగా ఎంతో సక్సెస్ చూశాడు. కెప్టెన్‌గా ఇప్పుడు టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుండి నడిపిస్తున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ తృటిలో మిస్సవడంతో నెక్స్ట్ జరగబోయే టీ20 కప్పునైనా భారత్‌కు అందించాలని పట్టుదలతో ఉన్నాడు. దశాబ్దంన్నర కింద అనామకుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రోహిత్.. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఎదిగాడు. తన కెరీర్ మొదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిట్‌మ్యాన్ అనేక విషయాలను పంచుకున్నాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి అదొక్కటే కారణమని అన్నాడు.
చిన్నప్పుడు తాను పడిన కష్టాలే తనను ఈ స్థాయికి చేర్చాయని రోహిత్ అన్నాడు. ఆ సమయంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందులు, ఎత్తుపల్లాల వల్ల రాటుదేలానని హిట్‌మ్యాన్ చెప్పాడు. ‘ఓ మనిషిగా నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నా గత జీవితమే. చిన్నతనంలో పడిన బాధలు, కష్టాలు, ఎత్తుపల్లాలు క్రికెట్‌ను కొత్త కోణంలో చూసేందుకు నాకు ఉపయోగపడ్డాయి. అవి నన్ను డిఫరెంట్ పర్సన్‌గా మార్చేశాయి. క్రికెట్ అంటే నాకు పిచ్చి ప్రేమ. అదే నా ప్యాషన్. ఈ 17 ఏళ్ల క్రికెట్ జర్నీ ఎంతో అద్భుతంగా సాగింది. ఇంకొన్నేళ్లు ఇలాగే ఆడుతూ ప్రపంచ క్రికెట్ మీద నా ముద్రను మరింత గొప్పగా వేయాలని భావిస్తున్నా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఏ క్రికెటర్‌కైనా తన జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహించడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదన్నాడు రోహిత్. టీమిండియాకు సారథ్యం వహిస్తానని తానెప్పుడూ అనుకోలేదని.. ఆ దిశగా తాను ఆలోచించలేదన్నాడు. అయితే మంచి వ్యక్తులకు మంచే జరుగుతుందని అంటుంటారని, అందుకే తన విషయంలో అలా జరిగిందని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. భారత జట్టును కెప్టెన్‌గా ముందుండి లీడ్ చేయడాన్ని మించిన సంతోషం ఇంకొకటి లేదన్నాడు. టీమ్‌గా అందరం కలసికట్టుగా ఎలా ఆడాలి? ఎలా విజయాలు సాధించాలనే దాని మీదే తన ఫోకస్ ఉంటుందని, పర్సనల్ మైల్‌స్టోన్స్‌ను అస్సలు లెక్కచేయనని రోహిత్ స్పష్టం చేశాడు. జట్టులోని 11 మంది కలసి విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలిపాడు. మరి.. కెరీర్, లైఫ్‌పై రోహిత్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Rohit Sharma said – “Whatever I am today, the kind of human I am today, kind of person I am today to my family & my friends it’s mainly because what I have seen in my past and what I have seen in my downs and that helped me play sports in different way & makes different person”. pic.twitter.com/rgQEXh5vFV
— Tanuj Singh (@ImTanujSingh) May 15, 2024