Tirupathi Rao
Rinku Singh- Mitchell Starc: ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ లో కొందరిపై ఆడియన్స్ దష్టి ఉంది. వారిలో రింకూ సింగ్ ఒకడు. ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందు రింకూ సింగ్ అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చాడు.
Rinku Singh- Mitchell Starc: ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ లో కొందరిపై ఆడియన్స్ దష్టి ఉంది. వారిలో రింకూ సింగ్ ఒకడు. ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందు రింకూ సింగ్ అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చాడు.
Tirupathi Rao
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పండగ వాతావరణాన్ని అప్పుడే తెచ్చేసింది. అన్నీ జట్లు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇక వీటిలో కేకేఆర్ కథ చాలా ప్రత్యేకం. చాలా బలమైన మేనేజ్మెంట్. ఇప్పటికే రెండుసార్లు కప్ సాధించిన ఘనత ఉంది. అయితే.., ఇదంతా గతం మాత్రమే. గత కొన్ని సీజన్స్ గా కోల్ కత్తా మెరుగైన ప్రదర్శన చేసింది లేదు. లాస్ట్ సీజన్ లో అయితే చేతిలో మ్యాచ్ లని కూడా జారవిడుచుకుని క్వాలిఫై కాలేలకపోయింది. అయితే.. 2023 సీజన్ ఆ జట్టుకి మరోలా కలిసి వచ్చింది. ఆ జట్టులో అప్పటి వరకు అనామకుడిగా ఉన్న రింకూ సింగ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఓ మ్యాచ్ లో చివరి 5 బంతులను సిక్సర్లు గా మలిచి.. అద్భుత విజయాన్ని అందించాడు. అక్కడ నుండి వెనక్కి తిరుగు చూసుకోలేదు రింకూ. తాజాగా ఈ న్యాచురల్ హిట్టర్ తన బ్యాటింగ్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఐపీఎల్ ప్రధాన మ్యాచ్ లకి ముందు ప్రతి జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతాయి. మార్చి 23న కేకేఆర్ కి సన్ రైజర్స్ తో మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ టీమ్.. పర్పుల్, టీమ్ గోల్డ్‌గా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో గోల్డ్ టీమ్ లో ఆడిన రింకూ అపోజిషన్ బౌలర్లుని ఊచకోత కోసేశాడు. రింకూ సింగ్ 16 బంతుల్లోనే 37 పరుగులు సాధించడం విశేషం. అయితే.., రింకూ ఇన్నింగ్స్ లో స్టార్క్ బౌలింగ్ లో కొట్టిన భారీ సిక్స్ హైలెట్ గా నిలిచింది. రింకూ దెబ్బకి.. స్టార్క్ 4 ఓవర్లు వేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు.
ఐపీఎల్ వేలంలో రూ.24.75 కోట్లు పెట్టి కొన్న స్టార్క్ ని కేవలం రూ.55 లక్షలు ఆటగాడైన రింకూ బెంబేలెత్తించడం విశేషం. పైగా గోల్డ్ టీమ్ లో హైఎస్ట్ స్కోరర్ కూడా రింకూ సింగే. ప్రస్తుతం స్టార్క్ బాల్ ని భారీ సిక్స్ గా మలిచిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రింకూ సింగ్ గురించి అతని న్యాచురల్ టాలెంట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇలాంటి ఒక ప్లేయర్ ని ఇన్నాళ్లు బెంచ్ కే పరిమితం చేశాం అంటూ కోల్ కతా చాలానే బాధ పడింది. అయితే అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకోవడంలో రింకూ సింగ్ సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనతోనే టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, వన్డేల్లో తనదైన సత్తా చాటాడు.
ఇప్పటివరకు టీమిండియా తరఫున రింకూ సింగ్ 11 ఇన్నింగ్స్ లో 356 పరుగులు చేశాడు. వాటిలో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. 69 పరుగులు నాటౌట్ అతని హైఎస్ట్ స్కోర్ గా ఉంది. రింకూ సింగ్ ఎంత ప్రమాదకారో ఈ మ్యాచ్ తో అందరికీ తెలిసొచ్చినట్లు అయ్యింది. ఎందుకంటే స్టార్క్ కే చుక్కలు చూపించాడంటే.. మిగిలిన బౌలర్స్ పరిస్థితి ఏంటి అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కోల్ కతాకి మాత్రమే కాదు.. టీమిండియాకి కూడా రింకూ సింగ్ ఒక మంచి స్టార్ ప్లేయర్ అవుతాడు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి.. రింకూ సింగ్ భారీ సిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rinku Singh smashed a SIX to Mitchell Starc 🍿💥
This is Cinema!! pic.twitter.com/zQNhfPrqSR
— कट्टर KKR समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) March 19, 2024