Tirupathi Rao
ఐపీఎల్ 2024 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వ్యూహాలు రచిస్తోంది. కప్పు కొడతామంటూ కామెంట్స్ చేస్తోంది. అయితే హైదరాబాద్ జట్టు నిర్ణయంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ 2024 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వ్యూహాలు రచిస్తోంది. కప్పు కొడతామంటూ కామెంట్స్ చేస్తోంది. అయితే హైదరాబాద్ జట్టు నిర్ణయంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Tirupathi Rao
క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి కా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు తమ క్యాంపులకు చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు రెడీ అయిపోతోంది. గతేడాది టేబుల్ లీస్ట్ పొజిషన్ దక్కించుకున్న హైదరాబాద్ జట్టు ఈసారి మాత్రం కప్పు కొడతాం అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తగినట్లు మార్పులు కూడా చేస్తోంది. అయితే కెప్టెన్సీ విషయంలో కావ్యపాప తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అలాగే అదే విషయంపై రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
రవిచంద్రన్ అశ్విన్ తనకి అనిపించిన, తాను చెప్పాలి అనుకున్న విషయాలను చాలా ముక్కుసూటిగా చెప్పేస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సీజన్ కి హైదరాబాద్ జట్టు కెప్టెన్ ని మార్చడంపై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు. కావ్య మారన్ అయిడెన్ మార్కరమ్ ని కెప్టెన్ గా తప్పిచడంపై అశ్విన్ షాక్ కు గురయ్యాడు. అసలు వాళ్లు మార్కరమ్ ని కెప్టెన్ గా తప్పిస్తారని తాను భావించలేదని చెప్పాడు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు మార్కరమ్ కెప్టెన్ గా వహించిన విషయం తెలిసిందే. అతను సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా 2 టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
“సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో అద్భుతమైన జట్టుతో మార్కరమ్ టైటిల్స్ సాధించాడు. ఐపీఎల్ లో కూడా మార్కరమ్ కెప్టెన్ గా ఉంటాడు అనుకున్నాను. కానీ, పాట్ కమ్మిన్స్ ని హైదరాబాద్ జట్టు కెప్టెన్ ని చేశారు. అయితే అద్భుతంగా రాణించిన మార్కరమ్ ని కెప్టెన్ గా తీసేయడం వల్ల హైదరాబాద్ జట్టుకు తుది జట్టు విషయంలో ఇబ్బందులు తప్పవు. విదేశీ ఆటగాళ్ల విషయంలో ప్రతి మ్యాచ్ కి వీళ్లకి సమస్యలు ఎదురవుతాయి. ట్రావిస్ హెడ్ ని వాళ్లు బ్యాకప్ గా పెట్టుకున్నారు అనుకుందాం. అలా చూస్తే తుది జట్టులో మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, హసరంగలకు ఛాన్స్ ఇవ్వాలి.
ఒక వేళ హసరంగను కొన్ని మ్యాచుల్లో పక్కన పెడితే మార్కో జాన్సన్ లేదా ఫజల్ హాక్ ఫరూకీని ఆడించాల్సి ఉంటుంది. ఎలా చూసినా కమ్మిన్స్ ని కెప్టెన్ చేసినందుకు తుది జట్టు కూర్పులో మాత్రం ఇబ్బంది తప్పదు” అంటూ రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాలను తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై అటు అభిమానుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమైంది. గతంలో కూడా వార్నర్ విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారని.. ఇప్పుడు మార్కరమ్ విషయంలో ఇంతటి దారుణ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే.. తాజాగా ఈ ఏడాది ఆంథమ్ ని రిలీజ్ చేశారు. కప్పు మాత్రం కొట్టి తీరతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్ లో మాత్రం మార్చి 23న ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనున్నారు. మరి.. మార్కరమ్ ప్లేస్ లో పాట్ కమ్మిన్స్ ని కెప్టెన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.