SNP
Hardik Pandya, IPL 2024, MI vs GT: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తీసుకున్న ఓ చెత్త నిర్ణయం వల్లే వచ్చిందనే వాదన వినిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Hardik Pandya, IPL 2024, MI vs GT: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తీసుకున్న ఓ చెత్త నిర్ణయం వల్లే వచ్చిందనే వాదన వినిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. రోహిత్ శర్మ ప్లేస్‌లో పాండ్యా ముంబై ఇండియన్స్‌ను లీడ్ చేసే తొలి మ్యాచ్ కావడం, రెండేళ్లు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న పాండ్యా.. ఆ జట్టుకు వ్యతిరేకంగానే తొలి మ్యాచ్ ఆడాల్సి రావడం, రోహిత్ శర్మను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌కు పంపడం, గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలుకావడం, గ్రౌండ్‌లోకి కుక్క వస్తే.. స్టేడియంలోని ప్రేక్షకులంతా హార్ధిక్.. హార్ధిక్.. అంటూ గోల చేయడం, అబ్బో ఎన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు జరిగాయో నిన్నటి మ్యాచ్‌లో. అయితే.. అవన్ని పక్కన పెడితే.. సింపుల్‌గా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడానికి ఓ ప్రధాన కారణం ఉంది. అదే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తీసుకున్న ఓ చెత్త నిర్ణయం. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 31, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 45 పరుగులతో రాణించారు. రాహుల్ తెవాటియా 22 రన్స్‌తో పర్వాలేదనిపించాడు. దీంతో.. గుజరాత్, బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ముందు 169 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఈ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో సున్నా పరుగులకే ముంబై ఒక వికెట్ కోల్పోయింది. కానీ, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. నమన్, డెవాల్డ్ బ్రెవిస్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి.. ముంబైని తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు.
నమన్ 20 పరుగులు చేసి అవుటైనా.. రోహిత్-బ్రెవిస్ జోడీ ముంబైని ముందుకు నడిపించింది. రోహిత్ శర్మ 29 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 43 పరుగులు చేశాడు. బ్రెవిస్ 38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరగులు చేసి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పేశారు. వాళ్లిద్దరు అవుటైన తిలక్ వర్మ 25 రన్స్‌తో కొద్ది సేపు ఆడినా.. తర్వాత టిమ్ డేవిడ్, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా దారుణంగా విఫలం అవ్వడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఇక్కడే పాండ్యా తీసుకున్న మరో నిర్ణయం కూడా.. ముంబై ఓటమికి కారణమైంది. తన కంటే ముందు టిమ్ డేవిడ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపడం పాండ్యా చేసిన తప్పు. పాండ్యా నాలుగో స్థానంలోనో లేక టిమ్ డేవిడ్ కంటే ముందు బ్యాటింగ్‌కు వెళ్లి ఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది.
రషీద్ ఖాన్‌ను టిమ్ డేవిడ్ కంటే పాండ్యా బాగా ఆడగలడు. ఈ విషయం తెలిసినా కూడా పాండ్యా డేవిడ్‌ను ముందు పంపాడు. దాంతో అతను 10 బంతుల్లో 11 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తర్వాత పాండ్యా వెళ్లిన అప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. 4 బంతుల్లో 11 రన్స్ చేసి పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. అప్పటికి ముంబై 3 బంతుల్లో 9 రన్స్ చేయాలి. తర్వాతి 3 బంతుల్లో 2 రన్స్ మాత్రమే చేసిన ముంబై.. 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. చివర్లో వచ్చి మ్యాచ్‌ను ఫినిష్ చేసి.. హీరో అవుదాం అనుకున్న పాండ్యా.. మ్యాచ్ ఓడిపోవడంతో జీరోగా మిగిలిపోయాడు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ టామ్ ముడీ కూడా స్పందించాడు. పాండ్యా నాలుగో స్థానంలో ఎందుకు బ్యాటింగ్‌కు రాలేదో తనకు అర్థం కాలేదని అన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tom Moody ” To me it was a baffling decision,Hardik Pandya didn’t come out at number 4 & take the responsibility. It’s not just about leadership, it’s about tactical decisions as well.He was the right player to go at that point and win the game “pic.twitter.com/dcp5XPHoeh
— Sujeet Suman (@sujeetsuman1991) March 24, 2024