SRH vs MI: దటీజ్ రోహిత్.. కెప్టెన్సీ అంటే ఏంటో హార్దిక్​కు చూపించిన హిట్​మ్యాన్!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ తానేంటో చూపించాడు. తన విలువ ఏంటదనేది అతడికి అర్థమయ్యేలా చేశాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ తానేంటో చూపించాడు. తన విలువ ఏంటదనేది అతడికి అర్థమయ్యేలా చేశాడు.

ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్ట్రగుల్ అవుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్​లో బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు కెప్టెన్సీలోనూ దారుణంగా ఫెయిలయ్యాడు హార్దిక్. అతడి చెత్త కెప్టెన్సీ కారణంగా గెలవాల్సిన మ్యాచ్​లో ముంబై ఓడిపోయింది. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచ్​లోనూ హార్దిక్ తీరు మారలేదు. బ్యాడ్ డిసిషన్స్​తో టీమ్ కొంపముంచాడతను. ఈ తరుణంలో కలుగజేసుకున్న రోహిత్ శర్మ తానేంటో ప్రూవ్ చేశాడు. కెప్టెన్సీ అంటే ఏంటో హార్దిక్​కు చూపించాడు. దెబ్బకు కొత్త కెప్టెన్ షాకయ్యాడు.

ముంబైతో మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన ఈ బ్యాటర్.. మొత్తంగా 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఎంఐ బౌలర్లతో ఓ ఆటాడుకున్నాడు. అతడి ఊపు చూస్తుంటే ఇంకో పది బంతుల్లో సెంచరీ మార్క్​ను చేరుకునేలా కనిపించాడు. ఈ టైమ్​లో టీమ్​ను నడిపించే ఛార్జ్ తీసుకున్నాడు రోహిత్ శర్మ. హెడ్ కోసం టైట్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. హాఫ్​ సైడ్ షాట్ కొట్టేలా అతడ్ని ఉసిగొల్పాడు. పాండ్యాను బౌండరీ లైన్ దగ్గరకు ఫీల్డింగ్​కు పంపాడు హిట్​మ్యాన్. హెడ్​కు దూరంగా బంతులు వేయమని కొయెట్జీని ఆదేశించాడు. అంతే బౌలర్ బాల్ వేయడం రాంగ్ షాట్ ఆడి హెడ్ ఔట్ అవడం క్షణాల్లో జరిగిపోయింది.

బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పాండ్యా దెబ్బకు షాకయ్యాడు. రోహిత్ స్కెచ్ చూసి పిచ్చోడైపోయాడు. సరిగ్గా అంచనా వేయడం, కరెక్ట్ ప్లానింగ్, బ్యాటర్​ను రెచ్చగొట్టడం, బౌలర్​కు ఔట్ చేయగలవనే ధీమా ఇవ్వడం చూసి పాండ్యాకు మైండ్ బ్లాంక్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రోహిత్​ను మెచ్చుకుంటున్నారు. దటీజ్ హిట్​మ్యాన్ అంటున్నారు. ఊరికే ముంబైకి 5 కప్పులు రాలేదని చెబుతున్నారు. కెప్టెన్సీ అంటే ఇదీ అని అంటున్నారు. రోహిత్​ను చూసి పాండ్యా నేర్చుకోవాలని.. అతడి ముందు కొత్త కెప్టెన్ జుజుబీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా సారథ్య బాధ్యతల్ని రోహిత్​కు అప్పగించాలని లేకపోతే ముంబై కోలుకోవడం కష్టమేనని చెబుతున్నారు. మరి.. రోహిత్ కెప్టెన్సీ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments