Nidhan
సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు.
సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు.
Nidhan
అభిషేక్ శర్మ.. ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటాడు. మరీ అంత పొడగరి కాదు, కండలతో తిరిగిన దేహం కూడా లేదు. కానీ అతడు కొడితే బాల్ స్టాండ్స్‌లో పడాల్సిందే. పర్ఫెక్ట్ టైమింగ్, సరైన టెక్నిక్‌తో బంతుల్ని బాదడమే అతడి బలం. భారీ సిక్సులతో ఐపీఎల్-2024లో హైలైట్ అవుతున్నాడు ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్. రావడం రావడమే బిగ్ షాట్స్ కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను పోయిస్తున్నాడు అభిషేక్. ముంబై ఇండియన్స్ మీద మ్యాచ్‌లోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 23 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 16 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్‌ను చేరుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లతో పాటు ఏకంగా 7 భారీ సిక్సులు ఉన్నాయి. సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ తన బ్యాట్‌తో రెచ్చిపోయాడు అభిషేక్. భారీ షాట్లు బాదుతూ చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. అలాంటోడు టీమిండియాలోకి రాబోతున్నాడని తెలుస్తోంది.
చెన్నైతో మ్యాచ్‌లో 12 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు అభిషేక్. ఇందులో 3 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి. ముకేష్ చౌదరీని టార్గెట్ చేసుకున్న ఎస్ఆర్హెచ్ బ్యాటర్ ఒకే ఓవర్లో 27 పరుగులు పిండుకున్నాడు. ఇతర బౌలర్లనూ అతడు వదల్లేదు. ఇప్పటివరకు టోర్నీలో ఆడిన 4 మ్యాచుల్లో కలిపి 161 పరుగులు చేశాడు అభిషేక్. ఇందులో 12 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 217.56గా ఉంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్ లిస్ట్‌లో ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నాడు అభిషేక్. ఆ జాబితాలోని టాప్-5 బ్యాటర్స్‌లో ఎవ్వరికీ అతడికి ఉన్న స్ట్రైక్ రేట్ లేదు. దీన్ని బట్టే ఎస్ఆర్హెచ్ బ్యాటర్ ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఐపీఎల్లో అదరగొడుతున్న అభిషేక్ త్వరలో భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వినిపిస్తోంది.
ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌తో టీమిండియాలోకి అభిషేక్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాల సమాచారం. ఓపెనింగ్ స్పాట్ కోసం అతడ్ని సెలక్టర్లు సీరియస్‌గా పరిగణిస్తున్నారని తెలుస్తోంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆల్రెడీ ఫిక్స్. కానీ బ్యాకప్ ఓపెనర్‌గా అభిషేక్‌ను కరీబియన్ దీవులకు తీసుకెళ్లాలని బోర్డు ప్లాన్ చేస్తోందట. రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ఆ స్థానానికి ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ అతడు పెద్దగా ఫామ్‌లో లేడు. అదే టైమ్‌లో లెఫ్టాండర్ అయిన అభిషేక్ ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేయడం, పర్ఫెక్ట్ టైమింగ్‌తో షాట్లు కొడుతున్న విధానం, పేస్‌తో పాటు స్పిన్నూ సమర్థంగా ఎదుర్కోగల సత్తా సెలక్టర్లకు నచ్చిందట. అందుకే మెగా టోర్నీలో అభిషేక్ ఆడటం పక్కా అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. మరి.. అభిషేక్ శర్మను టీమిండియాలో చూడాలని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: SRHపై CSK బిగ్ మిస్టేక్.. ధోనీ ఉన్నా కూడా ఇలా ఎలా జరిగింది?
ABHISHEK SHARMA MADNESS 🤯🔥pic.twitter.com/M3gotzD8gc
— Johns. (@CricCrazyJohns) April 5, 2024