SRH ఎలిమినేటర్‌ గండం నుంచి బయటపడాలంటే ఇలా జరగాలి!

సన్​రైజర్స్ హైదరాబాద్​కు ఎలిమినేటర్ గండం పొంచి ఉంది. దీని నుంచి బయటపడాలంటే కమిన్స్ సేన ఇలా చేయాల్సి ఉంటుంది.

సన్​రైజర్స్ హైదరాబాద్​కు ఎలిమినేటర్ గండం పొంచి ఉంది. దీని నుంచి బయటపడాలంటే కమిన్స్ సేన ఇలా చేయాల్సి ఉంటుంది.

ఐపీఎల్-2024లో ఒకదాన్ని మించి మరో మ్యాచ్ జరుగుతోంది. దీంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్​ ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయ్యాయి. మిగిలిన రెండు బెర్త్​ల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్​రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీలు పోటీపడుతున్నాయి. ఈ మూడు జట్లలోనూ ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న జట్టు ఎస్​ఆర్​హెచ్. ఎందుకంటే ఆ టీమ్ ఇంకో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఒక్కదాంట్లో నెగ్గినా క్వాలిఫై అవుతుంది. అయితే ఆరెంజ్ ఆర్మీకి ఎలిమినేటర్ గండం పొంచి ఉంది. దాని నుంచి బయటపడాలంటే ఆ ఒక్క పని చేయాల్సి ఉంటుంది.

సన్​రైజర్స్ ప్లేఆఫ్స్ గురించి భయపడట్లేదు. నెట్ రన్​ రేట్ కూడా మెరుగ్గా ఉంది కాబట్టి తదుపరి ఆడే రెండు మ్యాచుల్లో ఓడినా ఎస్​ఆర్​హెచ్​కు ప్లేఆఫ్స్ క్వాలిఫై అవకాశాలు ఉన్నాయి. అందుకే స్వేచ్ఛగా ఆడి ఈ రెండు మ్యాచుల్లోనూ నెగ్గి 18 పాయింట్లతో పాయింట్స్ టేబుల్​లో టాప్-2లో ఫినిష్ చేయాలని చూస్తోంది. టాప్​-2లో నిలవాలంటే ఇవాళ గుజరాత్ టైటాన్స్​ మీద కమిన్స్ సేన నెగ్గాలి. అలాగే ఆఖరి లీగ్ మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​ను కూడా ఓడించాలి. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్​ను కోల్​కతా నైటర్ రైడర్స్ చిత్తు చేయాలి. అది సాధ్యం కాకపోతే రాజస్థాన్ స్మాల్ మార్జిన్​తో గెలవాలి. ఎస్​ఆర్​హెచ్ టాప్​-2లో ఫినిష్ చేయాలంటే ఇంకో విధంగా కూడా ఛాన్స్ ఉంది.

టాప్​-2లో చోటు దక్కించుకోవాలంటే గుజరాత్, పంజాబ్​తో జరిగే మ్యాచుల్లో ఒక దాంట్లో నెగ్గి, ఇంకో దాంట్లో 20 పరుగుల కంటే తక్కువ మార్జిన్​తో ఓడిపోవాలి సన్​రైజర్స్. అదే సమయంలో రాజస్థాన్​ను కేకేఆర్ 20 పరుగులు లేదా అంతకంటే భారీ తేడాతో ఓడించాలి. ఇలా జరిగితే ఎలిమినేటర్​ గండాన్ని దాటి క్వాలిఫైయర్​గా ప్లేఆఫ్స్​కు వెళ్తుంది కమిన్స్ సేన. ప్లేఆఫ్స్​లో భాగంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 నిర్వహిస్తారనేది తెలిసిందే. అలాగే 3, 4 స్థానాల్లో ఉన్న టీమ్స్ మధ్య ఎలిమినేటర్ నిర్వహిస్తారు. క్వాలిఫైయర్ 1లో నెగ్గిన జట్టు ఫైనల్​కు వెళ్తుంది.

క్వాలిఫైయర్ 1లో ఓడిన టీమ్ క్వాలిఫైయర్ 2లో భాగంగా ఎలిమినేటర్​లో గెలిచిన జట్టుతో పోటీపడుతుంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లు ఫైనల్​కు వెళ్తారు. టాప్​-2లో ఫినిష్ చేస్తే ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. క్వాలిఫైయర్ 1లో ఓడినా తిరిగి క్వాలిఫైయర్ 2లో గెలిస్తే ఫైనల్​కు రీచ్ అవ్వొచ్చు. అందుకే జీటీ, పంజాబ్​పై నెగ్గి క్వాలిఫైయర్స్​ ఆడాలని భావిస్తోంది ఎస్​ఆర్​హెచ్. అయితే అందుకు తాను గెలవడంతో పాటు ఇతర జట్ల గెలుపోటములు, సమీకరణాలు కూడా కలసిరావాలి. మరి.. ఎస్​ఆర్​హెచ్​ టాప్-2లో ఫినిష్​ చేస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments