Nidhan
వరుస ఓటములతో డీలాపడ్డ పంజాబ్‌కు, సక్సెస్ ట్రాక్‌పై ఉన్న గుజరాత్‌కు మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
వరుస ఓటములతో డీలాపడ్డ పంజాబ్‌కు, సక్సెస్ ట్రాక్‌పై ఉన్న గుజరాత్‌కు మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Nidhan
గతేడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లోనూ జోరు మీద ఉంది. ఆడిన 3 మ్యాచుల్లో రెండింట్లో గెలిచి మంచి ఊపులో కనిపిస్తోంది. ఈ టీమ్ తమ నాలుగో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొనేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో విక్టరీతో సీజన్‌ను పాజిటివ్‌గా స్టార్ట్ చేసిన ధావన్ సేన.. తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి డీలాపడింది. విజయాల జోరును కొనసాగించాలని అనుకుంటున్న గుజరాత్‌కు, మళ్లీ సక్సెస్ ట్రాక్ మీదకు రావాలని చూస్తున్న పంజాబ్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరగబోయే ఈ పోరులో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి నుంచి త్వరగా బయటపడిన గుజరాత్ టైటాన్స్.. మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ టీమ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్ మంచి టచ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్ బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ నాక్స్‌తో టీమ్‌కు అతి పెద్ద బలంగా మారాడు. డేవిడ్ మిల్లర్ కూడా ఫామ్‌ను అందుకున్నాడు. బౌలింగ్‌లో మోహిత్ శర్మ జట్టుకు ఆయువుపట్టులా మారాడు. మిడిల్ ఓవర్స్‌లో రన్స్ కట్టడి చేస్తూనే వికెట్లు కూడా పడగొడుతున్నాడు మోహిత్. అతడికి తోడుగా ఉమేశ్ యాదవ్, అజ్మతుల్లా ఒమర్జాయి రాణిస్తుండటం జీటీకి కలిసొచ్చే అంశం. కెప్టెన్సీలో గిల్ మ్యాచ్ మ్యాచ్‌కు ఇంప్రూవ్ అవుతున్నాడు.
పంజాబ్ జట్టులో నెగెటివ్ పాయింట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఆ టీమ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్కడే కన్సిస్టెంట్గా రన్స్ చేస్తున్నాడు. బెయిర్‌స్టో గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. మిగిలిన బ్యాటింగ్ యూనిట్ మొత్తం పేలవంగా పెర్ఫార్మ్ చేయడం టీమ్‌కు బిగ్ మైనస్‌గా మారింది. బౌలింగ్ యూనిట్ కూడా సమష్టిగా రాణించడం లేదు. సామ్ కర్రన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ అర్ష్‌దీప్, రబాడ, రాహుల్ చాహర్ భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. హర్షల్ పటేల్ అయితే వికెట్లు తీయకపోగా ధారాళంగా రన్స్ సమర్పించుకుంటూ టీమ్‌కు బిగ్ మైనస్‌గా మారాడు. గెలుపోటముల సంగతి పక్కనబెడితే పంజాబ్ ఒక టీమ్‌గా ఇంతవరకు సెట్ కాకపోవడం గమనార్హం.
ఇరు జట్ల బలాబలాలను బట్టి రేపటి మ్యాచ్‌లో గుజరాత్ నెగ్గడం ఖాయం. ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఒకసారి పంజాబ్ నెగ్గగా.. మిగిలిన రెండు మ్యాచుల్లో జీటీ గెలిచింది. రేపటి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించడం కంటే కూడా ఓవరాల్ టీమ్ ఎఫర్ట్ పెట్టడంపై పంజాబ్ ఫోకస్ చేయాలి. ఆ టీమ్ జీటీని మట్టికరిపించాలంటే తమ బెస్ట్ గేమ్‌ను బయటపెట్టాలి.
గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయి, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ.
పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శషాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్.