Nidhan
విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ, కోల్‌కతా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గే టీమ్ మరింత డేంజరస్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ, కోల్‌కతా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గే టీమ్ మరింత డేంజరస్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Nidhan
వరుస విజయాలతో జోష్ మీద ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు రెడీ అవుతోంది. సూపర్బ్ విక్టరీతో సక్సెస్ ట్రాక్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది కేకేఆర్. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన పంత్ సేన.. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. కోల్‌కతా పోరుకు ఆ టీమ్ సై అంటోంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ మరింత డేంజరస్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటోంది. గెలుపోటముల సంగతి పక్కనబెడితే బౌలింగ్, బ్యాటింగ్‌లో తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచుల్లో ఓడినా మూడో మ్యాచ్‌లో తేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేను 20 పరుగుల తేడాతో ఓడించింది. పృథ్వీ షా సూపర్ టచ్‌లో కనిపిస్తున్నాడు. అతడి రాకతో ఓపెనింగ్ కష్టాలు తీరిపోయాయి. డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉన్నారు. పంత్ బ్యాటర్‌గా, సారథిగా తన మార్క్ చూపిస్తూ ఆ జట్టుకు కొండంత బలంగా మారాడు. స్టబ్స్, మార్ష్ నిలకడగా పరుగులు చేస్తే ఆ టీమ్‌ను ఆపడం కష్టమే. బౌలింగ్‌లో ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ రాణిస్తుండటం అదనపు బలం. ముకేష్ మ్యాచ్ టర్నింగ్ స్పెల్స్‌తో చెలరేగుతుండటం బిగ్ ప్లస్.
ఈ సీజన్లో కోల్‌కతా మంచి కాక మీద ఉంది. బ్యాటింగ్ ఆ టీమ్ బలం. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ అద్భుతమైన స్టార్స్ అందిస్తున్నారు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ కూడా చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నారు. కెప్టెన్ అయ్యర్ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో రస్సెల్, హర్షిత్ రానా అదరగొడుతుండటం కలిసొచ్చే అంశం. మిడిల్ ఓవర్స్‌లో రస్సెల్ పరుగులు కట్టడి చేస్తూ కీలకంగా మారాడు. నరైన్ కూడా అవసరమైన టైమ్‌లో బ్రేక్‌త్రూ అందిస్తున్నాడు. అయితే బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. అలాగే వికెట్లు కూడా తీయడం లేదు. అతడే ఈ జట్టుకు బిగ్ మైనస్.
ఈ రెండు జట్ల బలాబలాలను బట్టి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నెగ్గడం ఖాయం. ఇరు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 32 మ్యాచులు జరిగాయి. ఇందులో 15 మ్యాచుల్లో ఢిల్లీ.. 16 మ్యాచుల్లో కేకేఆర్ గెలిచాయి. అయితే కోల్‌కతా ఈ సారి ఉన్న ఫామ్, ఆ జట్టులో ఉన్న బ్యాటింగ్ డెప్త్ చూస్తుంటే ఆ టీమ్‌ను ఆపడం పంత్ సేనకు తలకు మించిన పనే.
ఢిల్లీ:
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోకియా, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.
కోల్‌కతా:
ఫిల్ సాల్ట్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, అనుకూల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
ఇదీ చదవండి: పాండ్యా మరీ ఇంత సెల్ఫిషా? మ్యాచ్‌లో ఇది ఎవరూ గమనించలేదు!