Python, Australia: వీడియో: ఇంట్లోని సీలింగ్ లో రెండు కొండ చిలువలు.. ఆమె ఏం చేసిందో చూడండి!

వీడియో: ఇంట్లోని సీలింగ్ లో రెండు కొండ చిలువలు.. ఆమె ఏం చేసిందో చూడండి!

  • Author Soma Sekhar Published - 09:37 AM, Sat - 26 August 23
  • Author Soma Sekhar Published - 09:37 AM, Sat - 26 August 23
వీడియో: ఇంట్లోని సీలింగ్ లో రెండు కొండ చిలువలు.. ఆమె ఏం చేసిందో చూడండి!

కొండ చిలువ.. ఈ పేరు వినగానే దాని ఆకారం మీ కళ్ల ముందు మెదిలే ఉంటుంది. ఇక దాన్ని చూడగానే మన ఒళ్లు గగుర్పొడుస్తుంది. సాధారణంగా జూలో ఉన్న కొండ చిలువను చూడాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాంటిది ఓ మహిళ ఎలాంటి భయం లేకుండా.. రెండు భారీ కొండ చిలువలను చాకచక్యంగా పట్టుకుంది. ఇంట్లోని సీలింగ్ లో ఉన్న రెండు కొండ చిలువలను పట్టుకుని బయటపడేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ల ముందు పాము కనిపిస్తే.. ఎగిరి గత్తేస్తాం. పై ప్రాణాలు పైనే గాల్లో కలిసిపోతాయి కూడా. కానీ ఈ మహిళ మాత్రం అలా కాదు. ఆమె డేరింగ్ చూస్తే.. మనకే ఆశ్చర్యం కలగక మానదు. ఇంట్లోని సీలింగ్ లో ఉన్న రెండు కొండ చిలువలను చేయితో పట్టుకుని బయటపడేసింది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లోని సీలింగ్ లో సౌండ్ రావడాన్ని గమనించింది ఓ మహిళ. దాంతో అందులో ఏముందా అని చూసిన ఆ మహిళకు ఊహించనిది అక్కడ కనిపించింది. సీలింగ్ లో రెండు భారీ కొండ చిలువలు ఉండటం సదరు మహిళ గమనించింది. వెంటనే ఓ స్టిక్ పట్టుకొచ్చి.. కొద్దిగా కూడా భయం లేకుండా ఆ రెండు భారీ కొండ చిలువలను ఒకేసారి పట్టుకుని బయటపడేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా చూశారు. మరి ఎంతో డేరింగ్ గా కొండ చిలువలను పట్టుకున్న ఈ మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: VIDEO: ఛీ.. ఈమె ఓ టీచరా? ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే ఘటన

Show comments