P Krishna
US President Joe Biden: ప్రపంచంలో ఎక్కడైనా.. ఎంత గొప్ప పొజీషన్‌లో ఉన్నవారైనా నేరం చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేరని పలు సంఘటనలు రుజువు చేశాయి. చట్టం అందరికీ సమానమే అని మరో సంఘటన రుజువు చేసింది.
US President Joe Biden: ప్రపంచంలో ఎక్కడైనా.. ఎంత గొప్ప పొజీషన్‌లో ఉన్నవారైనా నేరం చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేరని పలు సంఘటనలు రుజువు చేశాయి. చట్టం అందరికీ సమానమే అని మరో సంఘటన రుజువు చేసింది.
P Krishna
నేరం చేసిన వారు ఎలాంటి పొజీషన్లో ఉన్నా.. ఎంత గొప్ప ఫ్యామిలీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా శిక్ష నుంచి తప్పించుకోలేరని మరోసారి రుజువైంది. అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించి మూడు కేసుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ (54) ను న్యాయం దోషిగా తేల్చింది. మంగళవారం డెలావేర్ లోని విల్మింగ్టన్ కోర్టు జడ్జీ మేరీ ఎల్లెన్ నోరికా హంటర్ నేరంపై తీర్మాణం వెల్లడించారు. విచారణ సందర్భంగా బైడెన్ సతీమణి, హంటర్ తల్లి జిల్ బైడెన్ కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన తర్వాత హంటర్ బైడెన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత భార్య, తల్లి కోర్టు నుంచి ఆవేదనతో వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..
అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ (54) తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్న కేసులో దోషిగా తేరారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ అయ్యింది. మంగళవారం న్యాయమూర్తి మెరీ ఎల్లెన్ నోరీకా హంటర్ నేరాన్ని నిర్దారించారు. అయితే ఎంత కాలం శిక్షా కాలం అనేది వెల్లడించలేదు. దోషిగా నిర్ధారించడానికి ముందు జ్యూరీ రెండు రోజుల్లో మూడు గంటల పాటు సమావేశం అయ్యింది. ఇలాంటి కేసుల్లో సుమారు 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు తొలిసారి చేసిన నేరం కనుక శిక్ష తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు. హంటర్ బైడెన్ నేరాన్ని నిర్దారించిన జడ్జీ ఎంత కాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. విచారణ సందర్భంగా బైడెన్ సతీమణ, హంటర్ భార్య కోర్టుకు వచ్చారు.
2018లో హంటర్ బైడెన్ కొకైన్ కి బానిసయ్యాడు. ఆ సమయంలో గన్ కొనేందుకు సిద్దమయ్యాడు. గన్ కొనుగోలు సమయంలో, మాదకద్రవ్యాల వినియోగంపై తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చాడు.. దీనిపై కోర్టు విచారణ సమయంలో హంటర్ మాజీ భార్య కాథ్‌లీన్ బుహ్లీ, అతని సోదరుడి భార్య తో సహా అనేక మంది సాక్ష్యాలు పరిగణలోకి కోర్టు తీసుకుంది. హంటర్ మాజీ లవర్, అతని కుమార్తె నవోమీ బైడెన్ కూడా అతని మాదక ద్రవ్యాల వినియోగంపై కోర్టులో సాక్ష్యం ఇచ్చారు.