వీడియో: జపాన్ లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం!

సోమవారం జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇళ్లల్లో నుంచి జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సోమవారం జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇళ్లల్లో నుంచి జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైనట్లు జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇంటికి బయటికి పరుగులు పెట్టారు. సెంట్రల్ జపాన్ లోని ఇషికావా ఫ్రి ఫెక్చర్ లో భూ ఉపరితలం నుంచి కొన్ని కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు ఏర్పడినట్లు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలోనే సునామి హెచ్చరికలను కూడా అధికారులు  జారీ చేశారు. సముద్రంలోని అలలు 5 మీటర్ల మేర ఎగసిపడే అవకాశం ఉందని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇషీకావ, నిగాట, టొయోమా రాష్ట్రాలకు సునామీ ప్రభావం ఉన్నట్లు హెచ్చరించారు. అలానే న్యూక్లియర్ విద్యుత్ కేంద్రలా దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.

కొత్త ఏడాది తొలిరోజే.. సూర్యుడు ఉదయించే దేశంగా పేరుగాంచిన జపాన్ దేశంలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో కేవలం గంటన్నర వ్యవధిలో 21 సార్లు భూమి కంపించింది.  జపాన్ లోని నోటో ప్రాంతంలో ఏడు సార్లు భూ ప్రకంపనాలు వచ్చాయి. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:06 గంటల సమయంలో 5.7 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. వెనువెంటనే మరో భూకంపం 4:10 గంటలకు 7.6 తీవ్రతతో నమోదైందని అధికారులు తెలిపారు. మరోసారి 4:18, 4:23 గంటలకు  6.1, 4.5 తీవ్రతలతో భూమి కంపింతింగి, అలానే 4:29 గంటలకు 4.6, 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జేఎంఏ నివేదికలో పేర్కొంది.

సునామీ ధాటికి అలలు ఎగిసి పడడంతో, తీర ప్రాంత ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోవైపు సునామీ తీర ప్రాంతాలన్నింటిని తాకవచ్చని అక్కడి ప్రభుత్వం టీవీ ఛానెల్స్ ద్వారా హెచ్చరించింది. భారీ అలలు ఎగసి పడే పరిస్థితి కనిపిస్తే.. వెంటనే పరుగులు తీయాలని ప్రజలకు సూచించింది. మరోవైపు భూకంపం తర్వాత టయోమా, ఇషికావా, నిగాటాలో దాదాపు 35 వేల నివాసలకు కరెంట్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇతర నష్టం వివరాలు తెలియాల్సింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలో నోటో ప్రాంతంలో వరుసగా భూ ప్రకంపనలు వచ్చాయి.

తొలుత 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనాలు మొదలయ్యాయి. ఒక దశలో తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపారు అధికారులు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో డిస్ ప్లే బోర్డులు ఊగిపోతున్న విజువల్స్ ని వీడియో తీసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జపాన్ మీడియా. ఇందులో భూమి కంపించే వీడియో స్పష్టంగా కనిపిస్తోంది.

Show comments