బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్స్! వైరల్ వీడియో..

  • Author Soma Sekhar Published - 09:59 PM, Wed - 30 August 23
  • Author Soma Sekhar Published - 09:59 PM, Wed - 30 August 23
బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్స్! వైరల్ వీడియో..

బోయింగ్ 777.. ప్రపంచంలోనే అతి పెద్ద విమానంగా పేరుగాంచింది. మరి అలాంటి విమానం ఎదురుగా కనిపిస్తే.. సెల్ఫీల మీద సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. కానీ ఆ విమానంలో పని చేసే సిబ్బంది కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. ఏకంగా బోయింగ్ 777 విమానం రెక్కపై ఎయిర్ హోస్టర్, అధికారి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సదరు విమానయాణ సంస్థ రియాక్ట్ అయ్యింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

బోయింగ్ 777 విమానం ఎయిర్ పోర్ట్ లో ఆగింది. ఈ క్రమంలోనే ఓ మహిళా సిబ్బంది విమానం రెక్క వైపు ఉన్న డోర్ తీసుకుని.. ఫ్లైట్ రెక్కపైకి వచ్చింది. వచ్చి ఆ రెక్కపై డ్యాన్స్ చేసింది. ఈ మహిళ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి వచ్చి.. ఫోజులిచ్చాడు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ దగ్గర వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో.. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రియాక్ట్ అయ్యింది.

కాగా.. బోయింగ్ రెక్క 5 మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీంతో ఇంత ఎత్తు నుంచి కింద పడితే.. తీవ్ర ప్రమాదం జరుగుతుందని ఎయిర్ పోర్ట్ యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది స్విస్ ఎయిర్ లైన్స్. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments