నైట్రోజన్‌ గ్యాస్‌‌తో దోషికి మరణశిక్ష..ఎక్కడో తెలుసా?

Nitrogen Gas Execution America: సాధారణంగా ఉరి శిక్ష పడిన వారికి ఆయా దేశాల ప్రకారం శిక్షలు అమలు చేస్తుంటారు. తాజాగా అమెరికాలో వినూత్న పద్దతిలో అంటే నైట్రోజన్ గ్యాస్ తో మరణ శిక్ష అమలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Nitrogen Gas Execution America: సాధారణంగా ఉరి శిక్ష పడిన వారికి ఆయా దేశాల ప్రకారం శిక్షలు అమలు చేస్తుంటారు. తాజాగా అమెరికాలో వినూత్న పద్దతిలో అంటే నైట్రోజన్ గ్యాస్ తో మరణ శిక్ష అమలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్న విషయం తెలిసిందే.. అందులోనూ మనుషుల ప్రాణాలు తీసిన వారికి మరణ శిక్ష అమలు చేస్తుంటారు. ప్రపంచ దేశాల్లో దోషులకు మరణ శిక్ష రక రకాల పద్దతుల్లో అమలు చేస్తుంటారు. కొన్ని దేశాల్లో ఉరిశిక్ష, కత్తితో తల నరకడం, మరికొన్ని దేశాల్లో తుపాకీతో బహిరంగంగా కాల్చివేయడం లాంటివి చేస్తుంటారు.ఇటీవల అమెరికాలోవినూత్నమైన పద్దతి అంటే నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా దోషికి మరణ శిక్ష అమలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పద్దతిలో మరోసారి దోషికి మరణశిక్ష అమలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

దక్షిణ అలబామా లో తాను పనిచేసే చోట ముగ్గురిని హతమార్చిన కేసులో దోషిగా తేలిన అలాన్ యుగేని మిల్లర్ (59) అనే వ్యక్తికి గురువారం శిక్ష అమలు చేశారు. ఆయన ముఖానికి మాస్క్ బిగించిన అధికారులు ఓ రూమ్ లోకి నెట్రోజన్ గ్యాస్ పంపడం మొదలు పెట్టారు. దీంతో రెండు నిమిషాల్లో మిల్లర్ కిందపడిపోయి..మరో ఆరు నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఈ మరణశిక్ష ప్రక్రియ ఎనిమిది నిమిషాల్లో పూర్తయినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే అలబామా జైలులో ఈ తరహా మరణ శిక్ష అమలు పర్చడం ఇది రెండోసారి. 1999 నాటి హత్య కేసులో మిల్లర్ దోషిగా తేలడంతో అతడికి మరణ శిక్ష విధించారు.

ట్రక్ డ్రైవర్ గా పనిచేసే మిల్లర్ 1999 ఆగస్టు 5న తాను పని చేసే ఫెర్గూస్ ఎంటర్ ప్రైజెస్ కి వెళ్లి ఇద్దరు ఉద్యోగులను కాల్చి చంపాడు. ఆ తర్వాత గతంలో తాను పనిచేసిన ఆఫీస్ కి వెళ్లి అక్కడ జార్విస్ అనే ఉద్యోగిని కాల్చి చంపాడు.  మిల్లర్ మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల తోటి ఉద్యోగులను కాల్చి చంపినట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మిల్లర్ కి మరణశిక్ష విధించింది. వాస్తవానికి 2022లో అతడికి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేయాలని భావించారు.. కానీ ఊబకాయం వల్ల అతని నరం దొరకపోవడంతో అది అమలు కాలేదు. చివరికి నెట్రోజన్ గ్యాస్ తో అతని శిక్ష అమలు చేశారు.

గతంలో ఇదే తరహా మరణ శిక్ష హత్య కేసులో నిందితుడిగా ఉన్న కెన్నెత్ స్మిత్ (58) కి అమలు చేశారు. స్మిత్ శిక్ష అమలుకు ముందు ఈ పద్దతికి వ్యతిరేకంగా అతడి తరుపు న్యాయవాది సుదీర్ఘంగా పోరాడాడు.. కానీ న్యాయస్థానంలో ఊరట లభించలేదు. మరణ శిక్ష అమలు సమయంలో స్మిత్ నరకం అనుభవించాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏది ఏమైనా ఇటువంటి మరణ శిక్ష అమలు పై అమెరికాలో పెద్ద ఎత్తన చర్చలు నడుస్తున్నాయి.

Show comments