టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్ వెనుక మోస్సాద్ ఏజెంట్‌ జూలీ వావిలోవ

Govt Lady Agent Behind Telegram CEO Arrest Says Reports: సినిమాల్లో విలన్స్ ని పట్టించడానికి ప్రభుత్వం నియమించిన రా ఏజెంట్స్ పని చేస్తుంటారు. అచ్చం అలాంటి సీనే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విషయంలో జరిగిందన్న ఊహాగానాలు బలపడ్డాయి.

Govt Lady Agent Behind Telegram CEO Arrest Says Reports: సినిమాల్లో విలన్స్ ని పట్టించడానికి ప్రభుత్వం నియమించిన రా ఏజెంట్స్ పని చేస్తుంటారు. అచ్చం అలాంటి సీనే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విషయంలో జరిగిందన్న ఊహాగానాలు బలపడ్డాయి.

టెలిగ్రామ్ యాప్ సీఈఓ పావెల్ దురోవ్ ని ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పావెల్ తో పాటు మరొక యువతిని కూడా అరెస్ట్ చేశారు. ఆ యువతి పావెల్ గర్ల్ ఫ్రెండ్ జూలీ వావిలోవ అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు పావెల్ దురోవ్ అరెస్ట్ అవ్వడానికి కూడా జూలీనే కారణమని వార్తలు వస్తున్నాయి. రష్యా మార్క్ జుకర్ బర్గ్ గా పావెల్ పేరు తెచ్చుకుంటే.. జూలీ వావిలోవ మోస్సాద్ ఏజెంట్ గా పిలువబడుతుంది. మోస్సాద్ ఏజెంట్ అన్న అనుమానం కారణంగా ఆమెపై ఫ్రాన్స్ ప్రభుత్వం నిఘా ఉంచింది. ప్రభుత్వ నిఘా కింద గానీ లేదా దర్యాప్తులో గానీ ఉన్నట్లు కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఆమెని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు ఆ సమయంలో టెలిగ్రామ్ సీఈఓ పావెల్ ని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

జూలీ వావిలోవ (24).. దుబాయ్ లోని క్రిప్టో కోచ్ మరియు స్ట్రీమర్. ఇన్స్టాగ్రామ్ లో ఎంఎస్ వావిలోవ పేరుతో 20 వేల ఫాలోవర్స్ కలిగిన ప్రొఫైల్ ని కలిగి ఉంది. ప్రొఫైల్ లో ఉన్న సమాచారం ప్రకారం.. ఆమె ఒక గేమర్ అని తెలుస్తోంది. గేమింగ్, క్రిప్టో, లాంగ్వేజెస్, మైండ్ సెట్ వంటి అంశాలపై ఆసక్తి ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఇంగ్లీష్, రష్యా, స్పానిష్, అరబిక్ భాషలు ఆమె అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. ఈ జూలీ, పావెల్ ఇద్దరూ కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, అజర్ బైజాన్ వంటి ప్రదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు జూలీ ఇన్స్టా స్టోరీస్, హైలైట్స్ లో షేర్ చేసింది. ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేయకముందు రోజు జూలీ, పావెల్ ఇద్దరూ ప్రైవేట్ జెట్ లో ప్యారిస్ చేరుకున్నప్పుడు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ స్పష్టమైంది.

అయితే జూలీనే పావెల్ గర్ల్ ఫ్రెండ్ గా నటించి అధికారులకు పట్టించించి ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్యారిస్ లో పావెల్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల క్రిప్టో కమ్యూనిటీలో ఊహాగానాలు మొదలవ్వడంతో ఆమె కావాలని అధికారులకు సమాచారం ఇచ్చి ఉండవచ్చునని లేదా ఆమెకు తెలియకుండానే అరెస్ట్ జరిగి ఉండవచ్చునన్న కథనాలు అయితే వస్తున్నాయి. రష్యా మోస్సాద్ ఏజెంట్ గా ఉంటూనే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ గర్ల్ ఫ్రెండ్ గా నటించి హనీట్రాప్ చేసి ఉండవచ్చునని అంటున్నారు. పావెల్ అరెస్ట్ వెనుక ఆమె హస్తం ఉందా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే పావెల్ అరెస్ట్ తర్వాత జూలీ వావిలోవ కనీసం పావెల్ ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేయలేదని ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.    

Show comments