గుడ్ న్యూస్.. డ్రైవర్ లేకుండానే కూత పెట్టనున్న బుల్లెట్ ట్రైన్!

Japan News: మన దేశంలో వందే భారత్ రైళ్లు వివిధ  మార్గాల్లో పరుగులు పెడుతున్నాయి. ఇది ఇలా ఉంటే బుల్లెట్ ట్రైన్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే డ్రైవర్ లెస్ బుల్లెట్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అవి ఎక్కడంటే..

Japan News: మన దేశంలో వందే భారత్ రైళ్లు వివిధ  మార్గాల్లో పరుగులు పెడుతున్నాయి. ఇది ఇలా ఉంటే బుల్లెట్ ట్రైన్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే డ్రైవర్ లెస్ బుల్లెట్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అవి ఎక్కడంటే..

నేటికాలంలో రైల్వే ప్రయాణలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మనదేశంలో చాలా మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. టికెట్ ధర తక్కువగా ఉండటంతో రైళ్లలో జర్నీ చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. ఇది ఇలాంటే రైల్వేశాఖ కూడా ప్రయాణికులకు అనేక సదుపాయాలను కల్పిస్తుంది. అంతేకాక సాంకేతికతను ఉపయోగించి..కొత్త కొత్త ట్రైన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే వందే భారత్ రైళ్లు వివిధ  మార్గాల్లో పరుగులు పెడుతున్నాయి. ఇది ఇలా ఉంటే బుల్లెట్ ట్రైన్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే డ్రైవర్ లెస్ బుల్లెట్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే మనదేశంలో కాదులేండీ. మరి..ఎక్కడా అనే అనుమానం మీకు రావచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం….

జపాన్ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ దేశం పేరు చెప్పగానే బుల్లెట్ రైలు గుర్తుకు వస్తాయి. సేఫ్ జర్నీ కి, సమయపాలనకు జపాన్ ట్రైన్స్ పెట్టింది. పేరు.. ఇక్కడ ట్రైన్స్ టైమ్ కి రాకుండే భారీ జరిమానా కూడా ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే  ఆలస్యం అవుతాయి. అది కూడా రెండు,మూడు నిమిషాలు మాత్రమే ఆలస్యం అవుతాయి. ఇక శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిల్లో ప్రమాదాలు జరిగే అస్కారం అసలు ఉండదు.  జపాన్ రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్  అనేది చాలా కామన్ గా అనిపించే విషయం.

ఇదే సమయంలో తమ రైల్వే వ్యవస్థను మరింత మెరుగు పర్చుకునేందుకు జపాన్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. 2023 నాటికి అక్కడ డ్రైవర్లు లేకుండా బుల్లెట్ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతుననారు. తూర్పు జపాన్  రైల్వే లో తొలిసారిగా డ్రైవర్ లెస్ ట్రైన్లను ప్రవేశ పెట్టనున్నారు.  2028 నాటికి ఆ ప్రాంతంలో నడిచే రైళ్లలో డ్రైవర్ సేవలు పూర్తిగా ఆటోమేటిక్ కానున్నాయి. అయినాకూడా డ్రైవర్లు క్యాబిన్ లోనే అందుబాటులో ఉంటారని ఆ సంస్థ పేర్కొంది. ఆ తరువాత ఏడాది నుంచి డ్రైవర్ లెస్ ట్రైన్లను ట్రయల్ రన్  ద్వారా చేపట్టాలని తూర్పు జపాన్ రైల్వే  సంస్థ భావిస్తుంది.

2030 నాటికి టోక్యో-నిగాట మధ్య పూర్తి స్థాయి డ్రైవర్ లెస్ రైళ్లను ప్రవేశ పెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది.  ఇక ఈ విషయం గురించి తూర్పు జపాన్ రైల్వేకు చెందిన ప్రతినిధి ఒకరు కీలక విషయాలను తెలిపారు.  దేశంలో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో డ్రైవర్ లెస్ రైళ్లను తీసుకురావడం, వాటి నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడం ఎంతో ముఖ్యమన్నారు. డ్రైవర్ లెస్ సేవలు కార్మికుల కొరత, ఇతర సమస్యలను పరిష్కరించడంలో సాయపడతాయని రైల్వే ప్రతినిధి తెలిపారు. ఇక జపాన్ లో బుల్లెట్ ట్రైన్లను షింకాన్ సెన్ అని పిలుస్తారు.

జపాన్ లో జనాభా క్షీణిస్తుండటంతో ఇప్పటికే అక్కడి అనేక రంగాలు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో అన్ని రంగాల్లో కార్మికుల కొరతను తీర్చుకునేందుకు  జపాన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే డ్రైవర్ లెస్ బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments