P Krishna
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ లాంటి దేశాల్లో వరుస భూపంపాల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ లాంటి దేశాల్లో వరుస భూపంపాల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.
P Krishna
ఇటీవల ప్రపంచాన్ని భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. వరుస భూకంపాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా చైనా, భారత్, నేపాల్, పాకిస్థాన్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లో తరుచూ భూపంకాలు సంభవిస్తున్నాయి. భూకంప ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఉదయం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది వరకు మృత్యువాత పడ్డారు.. వేల సంఖ్యల్లో గాయాలపాలయ్యారు. తాజాగా చైనాలో భారీ భూకంపం రెండు ప్రావిన్సులను వణికించింది. వివరాల్లోకి వెళితే..
చైనా వాయవ్య ప్రాంతంలో అర్థరాత్రి సమయంలో భారీ భూకంపం సంభవించింది. గాన్సుకు 100 కిలోమీటర్ల దూరంలో ఖీంఘై వద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీనీ తీవ్రత 6.2 గా నమోదు అయినట్లు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. భూమి కంపించగానే జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. మొదట భారీ భూకంపం తర్వాత మరోసారి స్వల్పంగా భూమి కంపించడం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఇళ్లల్లోకి వెళ్లాలంటే భయంతో వణికిపోయినట్లు తెలుస్తుంది. ఈ భూకంప దాటికి గాన్సు ప్రావిన్స్ లో 100 మంది, క్వింఘై ప్రావిన్స్ లో 11 మంది చనిపోయినట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. వందల సంఖ్యల్లో గాయపడినట్లు తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల శిథిలాల కింద బాధితులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం చైనాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో రిస్క్యూ టీమ్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఓ వైపు మంచు, వాన కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంప నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది నెలకొన్నట్లు తెలుస్తుంది. రోడ్లపై మంచు భారీ ఎత్తున పేరుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో బాధితులను స్ట్రెచర్ లపై మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అర్థరాత్రి కావడంతో టార్చిలైట్స్, సెల్ ఫోన్ లైట్స్ వెలుతురు లో సహాయక చర్యలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. రెస్క్యూ బృందాలు ఎంతో శ్రమపడి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధ్యక్షులు జీ జిన్ పింగ్ ప్రకటించారు.