నేపాల్ లో వరదల బీభత్సం..స్తంభించిన జనజీవనం!

Nepal: భారీ వర్షాల కారణంగా నేపాల్ చిగురుటాకులా వణికిపోతుంది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ లేకుండా పోయింది.

Nepal: భారీ వర్షాల కారణంగా నేపాల్ చిగురుటాకులా వణికిపోతుంది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ లేకుండా పోయింది.

ఇటీవల భారత్ లో పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు వరదలు పొంగి పొర్లాయి. కేరళాలో కొండచరికలు విరిగిపడిన ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  ఇప్పుడు భారీ వర్షాలు నేపాల్ ని వణికిస్తున్నాయి. కంటిన్యూగా పడుతున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి గ్రామాలు, పట్టణాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దేశ రాజధాని ఖాట్మాండ్ లో పలు కాలనీలో పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మరో వంద మందికి పైగా తీవ్ర గాయాలు కాగా, 68 మంది గల్లంతయినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజా జీవనం పూర్తిగా అస్తవ్యస్థమైంది. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగి ఇప్పటి వరకు 112 మంది చనిపోయినట్లు ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదివారం ఖాట్మాండ్ లో వెల్లడించారు. వరదల్లో ఎంతోమంది గల్లంతయ్యారు.. వారి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తుందని తెలిపారు. గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని అన్నారు. వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయినట్లు వెల్లడించారు.

గడిచిన 54 ఏళ్లలో ఈ తరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అంటున్నారు అధికారులు. ఏకంగా 323 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదందని అంటున్నారు. వరదలకు దేశ వ్యాప్తంగా 4.12 లక్షల ఇళ్లు ప్రభావితం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఖాట్మండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా చుట్టుపక్కల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. 195 ఇళ్లు, 8 వంతెనలు ధ్వంసం అయినట్లు తెలిపారు. దాదాపు 3,100 మందిని భద్రతా సిబ్బంది కాపాడినట్లు చెప్పారు. వరదల్లో ఇప్పటికే ఇళ్లు కూలిపోగా.. కొన్ని కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు.

Show comments