Arjun Suravaram
Singapore Govt: సాధారణం 60 ఏళ్ల వృద్ధులు అంటే.. తమ విధులకు రిటైర్మెంట్ ఇచ్చి..హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. అలానే వారికి ప్రభుత్వాలు పలు రాయితీలు అందిస్తుంటాయి. కానీ ఓ దేశ ప్రభుత్వం మాత్రం వారిని తప్పకుండా పని చేయాలని చెప్పింది. మరి..కారణం ఏమిటో ఇప్పుడ చూద్దాం...
Singapore Govt: సాధారణం 60 ఏళ్ల వృద్ధులు అంటే.. తమ విధులకు రిటైర్మెంట్ ఇచ్చి..హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. అలానే వారికి ప్రభుత్వాలు పలు రాయితీలు అందిస్తుంటాయి. కానీ ఓ దేశ ప్రభుత్వం మాత్రం వారిని తప్పకుండా పని చేయాలని చెప్పింది. మరి..కారణం ఏమిటో ఇప్పుడ చూద్దాం...
Arjun Suravaram
ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని దేశాలు ఆర్థిక, ఉగ్రవాద, సమస్యలు ఎదుర్కొంటే..మరికొన్ని దేశాలు పేదరికం, వృద్దాప్యం, మానవ వనరుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలానే తాజాగా సింగపూర్‌లో ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి తలెత్తింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పని చేయాలని సింగపూర్ ప్రభుత్వం కోరుతోంది. మాములుగా వృద్ధులకు విశ్రాంతి ఇస్తుంటారు. కానీ సింగపూర్ మాత్రం విచిత్రంగా పని చేయాలని చెబుతుంది. మరి..సీనియర్ సిటిజన్స్ ను అంతలా పని చేయమని సింగపూర్ ప్రభుత్వం ఎందుకు కోరుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
సింగపూర్‌లో ప్రజల ఆయుర్దాయం పెరగడంతో పాటు అక్కడి వారు తక్కువ మంది పిల్లలను కంటున్నారు. యువ శ్రామిక శక్తి తగ్గిపోతుంటే, మరోవైపు రిటైరైనవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో రాబోయే సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, సీనియర్ సిటిజెన్స్ కూడా పని చేయాలని సింగపూర్ ప్రభుత్వం కోరుతోంది. 2026 నాటి సింగపూర్ అత్యధిక వృద్ధులు కలిగిన దేశంగా మారబోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరు 60 దాటిన వారు ఉంటారు. ఇక ఈ విచిత్ర సమస్య గురించి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన ఎకానమిస్ట్ షూలీ పలు విషయాలను తెలియజేశారు.
సాధారణంగా ఎవరైనా తక్కువ వయస్సులోనే రిటైర్ మెంట్ ఇవ్వాని కోరుకుంటారని తెలిపింది. అయితే ఆర్థిక కోణంలో ఆలోచిస్తే మాత్రం అలా తక్కువ వయస్సులో రైటర్ మెంట్ సరైనది కాదని షూ లీ తెలిపారు. అంతేకాక ఖాళీగా ఉండటం కారణంగా వృద్ధులు ప్రభుత్వానికి మోయలేని భారం అవుతారని తెలిపింది. అలానే వృద్ధాప్యంలో పని చేయడం అనేది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. అయితే అలా వృద్ధాప్యంలో పని చేయడం చాలా మందికి నచ్చకపోవచ్చు. అయితే కొందరు వృద్ధులు మాత్రం పనిచేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక తమకు ఎదురయ్యే సమస్యలను కూడా ప్రస్తావించారు. తాను పని చేయగలనని, కానీ తనను ఎవరు పనిలోకి తీసుకుంటారని ఓ 60 ఏళ్ల వృద్ధులు అన్నారు. ఎవ్వరైనా, ఏ కంపెనీ అయినా సరే యువతి, యువకులనే పనిలో పెట్టుకోవాలని భావిస్తుంటారు.
ఇలాంటి సమయంలో ఇక తమకు ఎవరు ఉద్యోగం ఇస్తారంటూ అక్కడి వృద్ధులు చెప్పుకొచ్చారు. అదే విషయం సింగపూర్ ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే వృద్ధులను అనగా 60 ఏళ్ల దాటిన వారిని పనిలోకి తీసుకునేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలా 60 ఏళ్లు దాటిన వారిని పనిలోకి తీసుకునేలా కంపెనీలను సింగపూర్ ప్రభుత్వం పోత్సహిస్తుంది. అందుకే వృద్ధులకు చెల్లించే జీతంలో కొంత ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. కంపెనీలు ఎంత ఎక్కువగా వృద్ధులకు ఉపాధి కలిపిస్తే.. అంత ఎక్కువగా రాయితీలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇదే సమయంలో వృద్ధులకు ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా ఉంటుంది. విశ్రాంతి తీసుకునే వృద్ధులను పనికి ఒప్పించడం ఒక ఎత్తు అయితే.. కంపెనీలు వారికి నిజంగా ఉపాధి కల్పించడం మరో ఎత్తుగా ఉంది. ఇది సింగపూర్ ప్రభుత్వానికి పెద్ద సవాల్ అనే చెప్పాలి.
ఈ సమస్య పరిష్కారం కోసం సింగపూర్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ధనం ఖర్చు చేయాల్సి రావచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే.. వయస్సును ప్రైవేటు రంగం భిన్నంగా చూసినప్పుడు మాత్రం ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాని మరేన్ని ప్రయత్నాలు చేసిన కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించదని పలువురు అంటున్నారు. ఇతర దేశాల మాదిరిగానే సింగపూర్ లోని ఉద్యోగులు, యాజమానులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి..సింగపూర్ ఎదుర్కొంటున్న ఈ విచిత్రమైన సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.